హనుమకొండ చౌరస్తా, జూలై 15 : కాకతీయ యూనివర్సిటీ పోతన గర్ల్స్హాస్టల్లో సీలింగ్ ఫ్యాన్ ఊడిపడి విద్యార్థినిపై పడింది. సోమవారం రాత్రి 11.30 గంటల కు బీపీఎడ్ ఫస్టియర్ చదువుతున్న వీణపై సీలింగ్ ఫ్యాన్ పడడంతో కుడిచేతికి తీవ్రగాయమైంది. తోటి విద్యార్థిను లు గమనించి యూనివర్సిటీ సిబ్బందికి తెలపడంతో 108లో ఎంజీఎం దవాఖానకు తరలించారు. అర్ధరాత్రి ప్రమాదం జరిగితే ఉదయం వరకు సమాచారాన్ని రిజిస్టర్లో ఎంట్రీ చేయకపోవడంతో సెక్యూరిటీ సిబ్బందిపై హాస్టల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతేడాది కూడా ఫ్యాన్ ఊడిపడటంతో ఓ విద్యార్థి ని తలకు తీవ్రగాయాలై 18 కుట్లు పడిన ఘటన తెలిసిం దే. శిథిలావస్థకు చేరిన హా స్టల్ భవనానికి మరమ్మతు లు చేపట్టకపోవడం వల్లే దుస్థితి ఏర్పడిందని కేయూ విద్యార్థి సంఘాల నేతలు, ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. హాస్టల్ అధికారుల నిర్లక్ష్యం తోనే ప్రమాదం జరిగిందని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. వెంటనే విద్యార్థినులను నూతన భవనంలోకి మార్చాలని డిమాండ్ చేశాయి.