ములుగు రూరల్, ఏప్రిల్ 28 : సమ్మక్క-సారక్క కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని మంగళవారం హైదరాబాద్‌లోని ఎయిమ్స్ వైద్య బృందం సందర్శించింది. ఈ మేరకు వైస్ చాన్సలర్ వైఎల్ శ్రీనివాస్‌ను కలిసి పలు అంశాలను అడిగి తెలుసుకున్నది. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల అభివృద్ధి, ఆరోగ్య సేవల మెరుగుదలకు యూనివర్సిటీని నోడల్ కేంద్రంగా చేసుకొని పలు కార్యక్రమాలు ప్రారంభించాలని ఇటీవల ఎయిమ్స్ ప్రతిపాదించిందని, మెడికల్ సైన్సెస్ సర్టిఫికెట్ కోర్సులను ప్రవేశపెట్టడం దీని ముఖ్య ఉద్దేశమన్నారు. ఎయిమ్స్‌తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకునే అవకాశముందని వీసీ పేర్కొన్నారు.