గణపురం, ఫిబ్రవరి 21: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి భూపాలపల్లి డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు 20 ఏళ్ల శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధించింది. ఎస్సై రేఖ అశోక్ కథనం ప్రకారం.. మండలంలోని చెల్పూర్ గ్రామానికి చెందిన పున్నం రంజిత్ 2022లో అదే గ్రామానికి చెందిన బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయంపై బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్సె అభినవ్ నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి సాక్ష్యాధారాలు సేకరించారు.
దీంతో అప్పటి డీఎస్పీ రాములు కేసు దర్యాప్తు చేశారు. కాగా, ప్రస్తుత డీఎస్పీ సంపత్రావు, చిట్యాల సీఐ మల్లేశ్, గణపురం ఎస్సై అశోక్, కోర్టు ఆఫీసర్ శ్వేత సాక్షులను ప్రవేశపెట్టగా లీగల్ సపోర్టర్ కల్వాల అఖిల సహకారంతో స్పెషల్ పీపీ విష్ణువర్ధన్ రావు కేసును కోర్టులో వాదించగా, సెషన్స్ కోర్టు జడ్జి పీ నారాయణ బాబు నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 20 వేల జరిమానా విధిస్తూ గురువారం తీర్పునిచ్చారు. ఈ సందర్భంగా భూపాలపల్లి డీఎస్పీ ఏ సంపత్ రావు, సీఐ మల్లేశ్, ఎస్సె అశోక్, కోర్టు లైజనింగ్ ఆఫీసర్, ఏఎస్సై వెంకన్న, కోర్టు కానిస్టేబుల్ శ్వేతను ఎస్పీ కిరణ్ ఖరే అభినందించారు.