అర్హులందరికీ ఆసరా పింఛన్లు
అర్హులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్లు అందించనుందని నర్సంపేట మండలం ఇటుకాలపల్లి సర్పంచ్ మండల రవీందర్, ఎంపీటీసీ భూక్యా వీరన్న అన్నారు.
- గ్రామాల్లో లబ్ధిదారులకు
- గుర్తింపు కార్డులు పంపిణీ చేసిన ప్రజాప్రతినిధులు
నర్సంపేటరూరల్/ఖానాపురం, అక్టోబర్ 6: అర్హులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్లు అందించనుందని నర్సంపేట మండలం ఇటుకాలపల్లి సర్పంచ్ మండల రవీందర్, ఎంపీటీసీ భూక్యా వీరన్న అన్నారు. గురువారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో కొత్తగా ఆసరా పింఛన్లు మంజూరైన వారికి గుర్తింపు కార్డులు పంపిణీ చేసి మాట్లాడారు. కార్డులు రానివారు ఏమాత్రం అధైర్య పడొద్దన్నారు. అర్హులకు తప్పకుండా పింఛన్లు వస్తాయని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు బొడిగె వినయ్గౌడ్, చంద్రమౌళి, నాగరాజు, రణధీర్, రజిత, కృష్ణ పాల్గొన్నారు. ఖానాపురం మండలం కొత్తూరులో లబ్ధిదారులకు సర్పంచ్ బూస రమ ఆసరా పింఛన్ల గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు.
దేశంలోని మరే రాష్ట్రంలో లేనివిధంగా సీఎం కేసీఆర్ తెలంగాణలో ఆసరా పింఛన్లు అందజేస్తున్నారని కొనియాడారు. తెలంగాణలో ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారని తెలిపారు. ఆయనకు అందరం అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బూస అశోక్, ఉపసర్పంచ్ సామేల్, కార్యదర్శి పులి స్రవంతి, వెంకటేశ్వర్లు, రాము, కుమారస్వామి, కట్టయ్య, చంద్రయ్య, కోటి, కారోబార్ యాకయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

