పద్మ పురస్కారానికి ఎంపికైన జనగామ జిల్లా దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లికి చెందిన చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యను ఆదివారం హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు ఘనంగా సన్మానించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నగదు బహుమతి కింద రూ.25లక్షల చెక్కును ఆయనకు అందించారు.