శుక్రవారం 05 జూన్ 2020
Warangal-rural - Feb 29, 2020 , 03:00:38

ప్రగతి వైపు పట్టణాలు

 ప్రగతి వైపు పట్టణాలు

నర్సంపేట, నమస్తే తెలంగాణ : పట్టణం ప్రగతి వైపునకు పరుగులు తీయాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నర్సంపేట ఒకటో వార్డులో శుక్రవారం జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఎన్నికల వాతావరణం తేలిపోయిందని అన్నారు. ముఖ్యమంత్రి నుంచి వార్డు కౌన్సిలర్‌ వరకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులనే ప్రజలు గెలిపించారని పేర్కొన్నారు.  ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నుంచి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.  గతంలో ఎన్నికైన పాలకులు ప్రజలకు మొహం చూపించే వారు కాదని అన్నారు. కానీ, టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు ప్రజల్లోనే ఉంటూ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారని తెలిపారు.  రామ రాజ్యం చూడలేదని, కానీ కేసీఆర్‌ పుణ్యా న రామ రాజ్యం కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రజలు అడక్కుండానే అనేక పనులు చేయిస్తున్నారని తెలిపారు. ప్రతి 1000 జనాభా, 250 ఇళ్లకు ప్రత్యేక జిల్లా అధికారిని  నియమించినట్లు చెప్పారు. 


పది రోజులుగా స్పెషల్‌ ఆఫీసర్‌ అందుబాటులో ఉండి ప్రజలకు కావాల్సిన అంశాలను తీర్మానాలుగా నమోదు చేసుకుని చివరి సమావేశంలో ఆమోదం తీసుకుంటారని చెప్పారు. దీని ప్రకారంగానే ప్రజలకు  పనులు వెంటనే చేపడుతారని వివరించారు. ప్రజలను కూడా పట్టణ ప్రగతిలో భాగస్వాములను చేస్తున్నారని అన్నారు. గతంలో కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధుల ఇళ్ల వరకే అభివృద్ధి పనులు ఉండేవని, కానీ ఇప్పుడు అలా కాదని తెల్చి చెప్పారు. పేదలు నివసించే బస్తీలో అన్ని సమస్యలను తీర్చుతామని అన్నారు.  కావాల్సిన మొక్కలను ఇంటింటికి అందిస్తామని తెలిపారు. ప్రతి 500 ఇళ్లకు ఒక చెత్త ట్రాక్టర్‌ వస్తుందని, దానిలోనే తడిపొడి చెత్తను వేయాలని కోరారు. మంచి నీటిపైపులైన్లు లీకేజీలు లేకుండా చూడాలని అన్నారు.  అధికారుల ఫోన్‌ నంబర్లను ఆయా వార్డుల కూడళ్లలో అందుబాటులో ప్రదర్శిస్తామని తెలిపారు.  ప్రతి ఇంట్లో మరుగుదొడ్డిని నిర్మించుకోవాలని కోరారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుంటి రజిని, వైస్‌ చైర్మన్‌ మునిగాల వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్‌ దేవోజు తిరుమల సదానందం, జిల్యా మత్స్యశాఖ అధికారి నరేశ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ విధ్యాదర్‌ పాల్గొన్నారు. 


విద్యార్థులు ఉత్తములుగా ఎదగాలి ..

 విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆకాంక్షించారు. నర్సంపేటలోని బాలికల ఉన్నత పాఠశాలలో శింగిరికొండ రామాంజనేయులు జ్ఞాపకార్థం శింగిరికొండ మాధవశంకర్‌ అందించిన 1000 ఇంగ్లిష్‌ డిక్షనరీలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నతులుగా ఎదగడానికి అవసరమైన విధంగా ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు.  విద్యార్థి దశలోనే పుస్తకాలను చదివే అలవాటు చేసుకుంటే మేలు కలుగుతుందని అన్నారు.  ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని అన్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుంటి రజిని, శింగిరికొండ మాధవశంకర్‌, శింగిరికొండ రాంరాజ్‌, రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీరాంఈశ్వరయ్య, మాదారపు చంద్రశేఖర్‌, ఎంఈవో దేవా, సొసైటీ చైర్మన్‌ మురాల మోహన్‌రెడ్డి, హెచ్‌ఎం మాధవి పాల్గొన్నారు.


logo