ఐఎంఏ అధ్యక్షుడిని కలిసిన రెడ్‌క్రాస్ చైర్మన్, డైరెక్టర్లు

పరకాల, నమస్తే తెలంగాణ : ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొత్తగట్టు శ్రీనివాస్‌ను రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, డైరెక్టర్ పోతాని రాజేశ్వరప్రసాద్ బుధవారం హన్మకొండలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పుష్పగుచ్ఛాలను అందించా రు. ఈ సందర్భంగా చైర్మన్, డైరెక్టర్లకు కొత్తగట్టు శ్రీనివాస్ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు రమణారెడ్డి పాల్గొన్నారు.
రెడ్‌క్రాస్ చైర్మన్ నిమ్మగడ్డకు సన్మానం
దామెర/ఆత్మకూరు/సంగెం : జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్‌గా నియమితులైన నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావును దామెర, ఆత్మకూరు మండల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు దామెర వైస్ ఎంపీపీ జాకీర్ అలీ ఆధ్వర్యంలో గజమాలతో ఘనంగా సన్మానించారు. ప్రజా సంక్షేమానికి విశేషంగా కృషి చేస్తున్న నిమ్మగడ్డకు రెడ్‌క్రాస్ చైర్మన్ పదవి దక్కడం ఎంతో అభినందనీయమని జాకీర్ అలీ అన్నారు. కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ బిల్లా రమణారెడ్డి, రవీందర్, ఏఎంసీ చైర్మన్ కాంతాల కేశవరెడ్డి, పార్టీ ఆత్మకూరు మండల అధ్యక్షుడు లేతాకుల సంజీవరెడ్డి, ప్రధాన కార్యదర్శి బొల్లెబోయిన రవియాదవ్, సర్పంచ్‌లు సత్యనారాయణరెడ్డి, బింగి రాజేందర్, పురాణం రాజేశ్వరి, ఈశ్వర్, సరోజనారెడ్డి, శ్రీధర్‌రెడ్డి, నాయకులు దుబాసి నవీన్, ఉపసర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు గోల్కొండ సురేందర్, మార్కెట్ డైరెక్టర్లు కౌటం మోహన్, సొసైటీ డైరెక్టర్ శనిగరం సంతోశ్, మాజీ ఎంపీటీసీ రమేశ్, అమ్ముల రాజు, సారాకిషన్, సునీల్‌రెడ్డి, జన్ను సాంబయ్య, పైండ్ల శ్రీనివాస్, పున్నం రమేశ్, సతీశ్ పాల్గొన్నారు. అలాగే, నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావును సంగెం మండల టీఆర్ఎస్ బీసీ సెల్ నాయకులు కూడా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మండల బీసీసెల్ అధ్యక్షుడు కౌడగాని శంకర్రావు, ఉపాధ్యక్షుడు కలకొండ దేవేంద్రచారి, నాయకులు పోశాల సతీశ్, రాంబాబు, నూనెల స్వామి, బొల్లకొండ శివ, ఓరుగంటి మల్లేశ్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- బస్సును ఢీకొన్న లారీ.. 8 మందికి గాయాలు
- లారీని ఢీకొట్టిన బైక్ : యువకుడు దుర్మరణం.. యువతికి తీవ్రగాయాలు
- లోన్ ఫ్రాడ్ కేసు: అహ్మదాబాద్‌లో హైదరాబాదీ అరెస్ట్
- మహేష్ బాబు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సర్కారు వారి పాట అక్కడ షురూ..
- ఆరు రాష్ట్రాల్లో ఆదివారం కొనసాగిన వ్యాక్సినేషన్
- 3,081 కరోనా కేసులు.. 50 మరణాలు
- 'ఓటీటీ సంస్థలు స్వీయ నియంత్రణ నిబంధనలు రూపొందించుకోవాలి'
- సల్మాన్ ఖాన్ 'కృష్ణ జింకల' వేట కేసు మరో ట్విస్ట్
- చిరుత దాడిలో అడవి పంది మృతి
- '57 ఏళ్లు నిండిన వారందరికీ త్వరలోనే ఆసరా పెన్షన్లు'