ప్రభుత్వ పథకాలపై కేంద్ర బృందం ఆరా..

శాయంపేట, ఫిబ్రవరి 18 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై జాతీయ స్థాయి మానిటరింగ్ బృందం మంగళవారం మండలంలో పర్యటించింది. బృందం లీడర్ సురంజన్రెడ్డి, సభ్యుడు హుస్సేన్‌లు నేరేడుపల్లి, ప్రగతిసింగారం, కాట్రపల్లి గ్రామాలను సందర్శించారు. ఈ సందర్బంగా స్వయం సహాయక బృందాలతో మాట్లాడారు. పింఛన్‌దారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఉపాధి హామీ అమలును పరిశీలించారు. పంచాయతీల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆరా తీశారు. ఒక్కో గ్రామంలో ఐదుగురు ఎస్‌హెచ్‌జీ గ్రూపు మహిళలతో మాట్లాడి వారి ఫోటోలను తీసుకున్నారు. అలాగే గ్రామ స్థాయిలో జరుగుతున్న ఈజీఎస్‌లో ఐదు పనులను తనిఖీ చేసి ఫోటోలను తీసుకున్నారు. ఐదుగురు పింఛన్ పొందుతున్న లబ్దిదారులతోను సమావేశమయ్యారు. అనంతరం బృందం లీడర్ సురంజన్రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో వారం రోజులు తనిఖీలు చేస్తామని తెలిపారు. జిల్లాలో పది గ్రామాలను సందర్శించి కేంద్ర ప్రభుత్వం నుంచి అమలయ్యేపథకాల అమలు ఎలా జరుగుతున్నాయో అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. పింఛన్లు, ఎస్‌హెచ్‌జీ గ్రూపులు, వీవోలు, జీపీ వనరులు, స్థిరాస్తులు, ఫర్నీచర్ వంటి అంశాలపై పరిశీలన చేస్తున్నట్లు తెలిపారు. మరి కొన్ని కార్యక్రమాలు కూడా వేరే చోట అమలవుతున్నట్లు పేర్కొన్నారు. వాటర్‌షెడ్, గృహ పథకం, రోడ్లు పథకాలపై కూడా పరిశీలన చేస్తున్నామని వాటిని ఫార్మాట్లో పొందుపరుస్తున్నట్లు వెల్లడించారు. అంతేగాకుండా దీనికి సంబంధించిన ఇతర అధికారులను కలిసి సమాచారం సేకరిస్తామన్నారు. మరో రెండు రోజుల్లో మరో ఆరు గ్రామాల్లో పరిశీలించనున్నట్లు తెలిపారు. తర్వాత జిల్లా స్థాయి అధికారులను కలిసి వారి నుంచి సమాచారం తీసుకుంటామన్నారు. అనంతరం ఫైనల్‌గా జిల్లా స్థాయిలో రిపోర్టు తయారు చేసి సెంట్రల్‌కు సమర్పిస్తామని సురంజన్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో సుమనవాణి, సర్పంచ్‌లు ఆకుతోట రాజేష్, పోతు సుమలత, ఏపీవో అనీత, ఈసీ రజనీకాంత్, టీఏలు గౌతంరాజు, రామన్న, ఐకేపీ సీసీ విజయ్, జీపీ కార్యదర్శి రాజు, తదితరులున్నారు.
ఆత్మకూరులో..
ఆత్మకూరు : మండలంలోని నీరుకుళ్ల గ్రామంలో కేంద్ర పథకాలపై నేషనల్ లెవల్ మానిటరింగ్ అధికారుల బృందం పరిశీలించి ఆరా తీశారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళ సంఘాలతో మానిటిరింగ్ అధికారి సురంజన్రెడ్డి కేంద్ర ప్రభుత్వ పథకాల పనితీరు ఏవిధంగా జరుగుతున్నాయా తెలుసుకున్నారు. అనంతరం ఆయన మట్లాడుతూ మహిళలు పొదుపు సంఘాలతో అభివృద్ధ్ది చెందాలన్నారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలన్నారు. గ్రామంలో శ్మశాన వాటిక, డంపింగ్ యార్డులు తప్పకుండా ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను యువకులు,మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదుగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అర్షం బలరామ్, ఎంపీడీవో నర్మద, ఎంఎన్ఎల్ టీం సభ్యులు హుస్సేన్, జిల్లా స్వచ్ఛ భారత్ ప్రతినిధి మలనేని శ్రీనివాస్‌రావు, కార్యదర్శి సుజాన, సీసీ శ్యాంసన్, వార్డు సభ్యులు,వీ వోలు పాల్గొన్నారు.
తాజావార్తలు
- స్మిత్ ముందే రోహిత్ శర్మ కూడా అదే పని చేశాడా.. వీడియో
- దొరస్వామి మృతికి ఎన్టీఆర్ సంతాపం
- తెలంగాణలో కొత్తగా 206 కరోనా కేసులు
- కోతిని తప్పించబోయి పల్టీ కొట్టిన కారు..
- కూతురి హత్యకు తల్లి 50 వేల సుపారీ..
- గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో నటి మీనా
- ఎన్టీఆర్ వర్ధంతి.. స్మరించుకున్న నందమూరి హీరోలు
- పాకిస్థాన్‌లో మోదీ ప్లకార్డులు.. ఎందుకు?
- ఈ పెళ్లాం వద్దురోయ్…!
- తాండవ్ కాంట్రవర్సీ.. లక్నోలో ఎఫ్ఐఆర్ నమోదు