మట్టెవాడ, సెప్టెంబర్ 11 : గణపతి నవరాత్రి ఉత్సవాలను పురసరించుకొని వరంగల్ నగరంలోని పాపయ్యపేట చమన్ మండపం వద్ద పెట్టిన లడ్డూ రికార్డు సృష్టించింది. 2,100 కిలోల లడ్డూ ప్రసాదాన్ని డోసైల్ డెలివరీ సర్వీసెస్ వారు వినాయకుడికి సమర్పించారు.
ఈ ప్రసాదాన్ని 400 కిలోల శనగపప్పు, 900 కిలోల చకెర, 200 కిలోల డ్రై ఫ్రూట్స్, 350 కిలోల నెయ్యి, నూనె ఉపయోగించి తయారు చేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. గణపతిపై తమకున్న భక్తితో లడ్డూ ప్రసాదాన్ని తయారు చేశామని, నిమజ్జనం రోజు తమ కంపెనీ యాప్ డౌన్లోడ్ చేసుకొని బుక్ చేసుకున్న భక్తుల ఇంటికి ఫ్రీగా లడ్డూ ప్రసాదాన్ని పంపిస్తామని చెప్పారు. రాష్ట్రంలోనే ఇది భారీ లడ్డూగా రికార్డుల్లో నిలుస్తుందని భక్తులు చెబుతున్నారు.