సంగెం,జూలై 5 : పల్లెప్రగతిలో ఊర్లన్నీ అద్దంలా మెరు వాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సూచించారు. పల్లెప్రగతిలో భాగంగా సోమవారం మండలంలోని పల్ల్లార్గూడ, పోచమ్మతండా, వీఆర్ఎన్ తండాలను పరిశీలించారు. పల్లార్గూడలో డంపింగ్ యార్డులో వర్మికంపోస్టు తయారీని ప్రారంభించారు. అనంతరం పోచమ్మతండా, పల్లార్గూడ ప్రాథమికోన్నత పాఠశాలలో మొక్కలు నాటి వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యుత్, మిషన్ భగీరథ, అంగన్వాడీ, పింఛన్లు, రేషన్‌కార్డులు తదితర శాఖల అధికారులతో మాట్లాడారు. విద్యుత్ శాఖ సమీక్షలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎండీ గ్రామంలోనే కరంట్ సమస్యలుంటే మిగతా గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంటుందని ఏఈ శ్రీకాంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. లూజ్వైర్ల్లు, విరిగిన స్తంభాలు ఉంటే మీరేం చేస్తున్నారంటూ వారిపై మండిపడ్డారు. పోచమ్మతండాలో మిష న్ భగీరథ నీరు రావడంలేదని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, ఎంపీపీ కందకట్ల కళావతి, మండల ప్రత్యేకాధికారి జీవరత్నం, ఎంపీడీవో ఎన్ మల్లేశం, తహసీల్దార్ విశ్వనారాయణ, వైస్ ఎంపీపీ మల్లయ్య, ఎంఈవో ఎన్ విజయ్‌కుమార్, మండల రైతుబంధు సమితి కన్వీనర్ నరహరి, సర్పంచ్‌లు కక్కెర్ల కుమారస్వామి, రమాదేవి, బిచ్చానాయక్, మేరుగు మల్లేశం, ఎంపీటీసీ గుగులోత్ వీరమ్మ, నాయకులు దోపతి సమ్మయ్యయాదవ్, పీ సారంగపాణి, గుగులోత్ గోపీసింగ్ మన్సూర్అలి, పీ ప్రశాంత్, వీరన్న, కోటేశం, రవి, నర్సింహ్మ, తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యం ..
గీసుగొండ: గ్రామాల అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని సోమవారం దస్రుతండా, నందనాయక్‌తండా, సూర్యతండా గ్రామాల్లో వీలేజ్ పార్కులను ప్రారంభించి, మొ క్కలను నాటారు. అనంతరం నందనాయక్తండాలో పల్లె ప్రగతి కార్యక్రమంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని, శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. గ్రామ కార్యదర్శులు, మండల స్థాయి అధికారులు ఎలాంటి రికార్డులు లేకుండా హాజరు కావడంతో ఆయన అధి కారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో గ్రామాల్లో పర్యటిస్తానని, పద్ధతి మారకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు పల్లెప్రగతి కార్యక్రమంలో పాల్గొని సమస్యలను పరిష్కారించుకోవాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనులు చేయాలన్నారు. అర్హులైన వారికి డబుల్బెడ్రూం ఇండ్లను కట్టిస్తామన్నారు. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధికి యావత్తు దేశం గర్విస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, ఎంపీడీవో గడ్డం రమేశ్, ఏపీవో మోహన్‌రావు, మూడు గ్రామాల సర్పంచ్‌లు కే సరోజన, వీ రజిత,బీ అమ్మి, ఎంపీటీసీ హనుమ నా యక్, ఉప సర్పంచులు కే గోపి, వీరన్న, కూడ డైరెక్టర్ వీరగోని రాజుకుమార్ తదితరులు పాల్గొన్నారు.
కూలీలతో ముచ్చటించిన ఎమ్మెల్యే ధర్మారెడ్డి
గీసుగొండ మండలం నందనాయక్ తండా లో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గ్రామ శివారులోని పత్తి చేన్లో కలుపు తీస్తున్న మహిళల వదకెళ్లి ముచ్చటించారు. యువతులు కలుపు తీస్తుండడంతో ఆయన మార్గ మధ్యంలో ఆగి యువతులతో మాట్లాడారు. మీకు ఆన్లైన్ క్లాసులు ఉన్నాయా..? అని వారిని అడిగి తెలుసుకున్నారు. కాసేసు పనులను వదిలి మీ గ్రామం లో నిర్వహించే సమావేశానికి హాజరు కా వాలని వారిని కోరడంతో, వారు పనులు నిలిపి, సమావేశానికి హాజరయ్యారు.