దేవరుప్పుల, ఆగస్టు 16 : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో సోమవారం జరిగిన దళితబంధు ప్రారంభోత్సవ సభకు మండలం నుంచి టీఆర్ఎస్ నాయకులు, దళితులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తీగల దయాకర్, యూత్ మండల అధ్యక్షుడు చింత రవి మాట్లాడుతూ దళితుల ఉద్దరణకు సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు దళితల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బస్వ మల్లేశ్, పల్లా సుందరరాంరెడ్డి, జోగు సోమనర్సయ్య, జేరిపోతుల సాయిలు, గడ్డం రాజు, చింత యాదగిరి, గుండె రమేశ్, పరశురాములు, అబ్బ య్య, కొత్త జలేందర్‌రెడ్డి, కోతి ప్రవీణ్ ఉన్నారు.
బచ్చన్నపేటలో..
బచ్చన్నపేట : హుజూరాబాద్‌లో జరిగిన దళితబంధు సభకు మండలం నుంచి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొడిగం చంద్రారెడ్డి ఆధ్వర్యంలో తరలివెళ్లారు. వీరిలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, జడ్పీ వైస్‌చైర్‌పర్సన్ గిరబోయిన భాగ్యలక్ష్మి, ఎంపీపీ బావండ్ల నాగజ్యోతి, సర్పంచ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు గంగం సతీశ్‌రెడ్డి, దూడల కనకయ్యగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ పూర్ణచందర్, మండల కోఆప్షన్ సభ్యులు షబ్బీర్, పట్టణ అధ్యక్ష్లులు గందమల్ల నరేందర్ ఉన్నారు.
తరిగొప్పులలో..
తరిగొప్పుల : హుజూరాబాద్‌లో నిర్వహించిన దళిత బంధు సభకు మండల నుంచి టీఆర్ఎస్ శ్రేణులు తరలి వెళ్లాయి. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు పింగిళి జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమ లు చేస్తున్న దళితబంధు పథకం దేశానికి ఆదర్శంగా ఉంద న్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చెర్మన్ కేశిరెడ్డి ఉపేం దర్‌రెడ్డి, సర్పంచ్‌లు దామెర ప్రభు దాస్, మండల నాయ కులు జొన్నగోని సుదర్శన్‌గౌడ్, చెన్నూరి సంజీవ, ఎండ భట్ల వెంకన్న పాల్గొన్నారు.
జఫర్‌గఢ్‌లో..
జఫర్‌గఢ్ : కరీనంగర్ జిల్లా హుజూరాబాద్‌లో నిర్వహించిన సీఎం కేసీఆర్ సభకు మండలం నుంచి టీఆర్ఎస్ శ్రేణులు తరలివెళ్లాయి. ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజ య్య ఆధ్వర్యంలో ఎంపీపీ రడపాక సుదర్శన్, టీఆర్ఎస్ నాయకులు గుజ్జరి రాజు, శంకర్, నరేశ్, చైతన్, రాజ్‌కుమార్ తరలి వెళ్లారు. ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ దళితుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ కా ర్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. అందరూ కేసీఆర్ కు అండగా నిలువాలని కోరారు.
పాలకుర్తిలో..
పాలకుర్తి రూరల్ : దళితబంధు సభకు మండలం నుం చి టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివెళ్లాయి. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్‌కుమార్, జడ్పీలో ఫ్లోర్ లీడర్ పుస్కూరి శ్రీనివాసరావు నేతృత్వంలో వెళ్లారు. ఈ కార్యక్రమంలో జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ మదార్, సర్పంచ్ వీరమనేని యాకాంతారావు, మండల కో ఆప్షన్ సభ్యుడు ఎండీ సర్వర్‌ఖాన్, నాయకులు పురుషోత్తం, రమేశ్, శ్రీను, ఎల్లయ్య పాల్గొన్నారు.
కొడకండ్లలో..
కొడకండ్ల : దళితబంధు సభకు మండలం నుంచి టీఆర్ఎస్ శ్రేణులతోపాటు ప్రజాప్రతినిధులు తరలివెళ్లారని ఎంపీటీసీల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందె యాక య్య తెలిపారు. ఈ సందర్భంగా హుజూరాబాద్ సభకు వెళ్తున్న వాహనాలకు ఆయన జెండాఊపి ప్రారంభించారు. యాకయ్య మాట్లాడుతూ దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు.