నర్సంపేటరూరల్/నల్లబెల్లి/దుగ్గొండి/చెన్నారావుపేట/రాయపర్తి/గీసుగొండ, సెప్టెంబర్ 11: వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని జిల్లాలోని పలు గ్రామాల్లో శనివారం నిర్వహించారు. నర్సంపేట మండలంలోని ముగ్ధుంపురంలో ఐలమ్మ చిత్రపటానికి తెలంగాణ రజక సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి చాపర్తి భిక్షపతి, కుల పెద్దలు మామిడాల కుమారస్వామి, పున్నం రాజు, మామిడాల అశోక్ పూలమాల వేసి నివాళులర్పించారు. రజక కుల సంఘం సభ్యులు ఆరెల్లి ప్రభాకర్, ఎం శివ, పీ అనిల్, పీ యాకయ్య, రమ, సమ్మక్క, శ్రుతి, మమత, వీరమ్మ పాల్గొన్నారు. నల్లబెల్లిలోని జీపీ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ ఊడుగుల సునీతాప్రవీణ్ ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. రజక సంఘం మండల అధ్యక్షుడు రాపాల లక్ష్మీనారాయణ, సర్పంచ్ ఎన్ రాజారాం, ఎంపీటీసీ జన్ను జయరావ్, టీఆర్ఎస్ నాయకులు గందె శ్రీనివాస్‌గుప్తా, నాగెల్లి మొగిలి, నాగేశ్వర్రావు, నన్నెసాహెబ్, ప్రభాకర్, చక్రపాణి, పైడి, వేణు పాల్గొన్నారు. దుగ్గొండిలో జరిగిన ఐలమ్మ వర్ధంతిలో ఏబీఎస్ఎప్ జిల్లా కార్యదర్శి బొట్ల నరేశ్, ఎమ్మార్పీఎస్, ఏబీఎస్ఎఫ్ నాయకులు, రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు. చెన్నారావుపేటలో జరిగిన ఐలమ్మ వర్ధంతిలో సర్పంచ్ కుండె మల్లయ్య, వైస్‌ఎంపీపీ కంది కృష్ణారెడ్డి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ రఫీ, మాజీ జడ్పీటీసీ జున్నూతుల రాంరెడ్డి, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఇల్లందుల సాంబయ్య, గౌరవ అధ్యక్షుడు మామిడాల నర్సయ్య, మండలాధ్యక్షుడు ఉప్పుల భిక్షపతి, మండల ప్రధాన కార్యదర్శి బర్ల యాకయ్య, కరుణాకర్, మర్రి రమేశ్, ఉప్పుల వీరస్వామి, సంగెం రమేశ్, రాజు, వంశీ, రాజు, కొమురయ్య, రాకేశ్, రామ్‌ప్రసాద్, అడుప రమేశ్, ఆటో యూనియన్ సంఘం నాయకులు పాల్గొన్నారు.
రాయపర్తిలోని జడ్పీఎస్ఎస్ ఆవరణలో ఐలమ్మ చిత్రపటానికి ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమారస్వామి తెలంగాణ ఉద్యమకారుడు పనికర మల్లయ్యతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. సర్పంచ్ గారె నర్సయ్య, ఎంపీటీసీ రాంచందర్, ఎండీ నయీం, సుధాకర్, రామ్‌యాదవ్, సత్యం, భాస్కర్‌రావు, రమేశ్‌రెడ్డి పాల్గొన్నారు. గీసుగొండలో జరిగిన ఐలమ్మ వర్ధంతిలో రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు చాపర్తి కుమార్, సర్పంచ్ బాబు, ఉపాధ్యాయుడు రామ్మూర్తి, నాయకులు సాంబయ్య, లక్ష్మీనారాయణ, సుధాకర్, అనిల్, శ్రీకాంత్, ఎల్లమ్మ, బొందమ్మ పాల్గొన్నారు.