వరంగల్, సెప్టెంబర్ 30 : గ్రేటర్ పరిధిలో ఆస్తి, నల్లా పన్నులు వంద శాతం వసూలు చేయాలని గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య అన్నారు. గురువారం కార్పొరేషన్లో పన్నుల విభాగం అధికారుల తో ఆస్తి పన్ను వసూళ్లు, అసెస్మెంట్లు, మ్యుటేషన్ పెండింగ్ పైళ్లపై సమీక్ష చేశా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ.. ముఖ్యంగా మొండి బకాయిలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రేటర్ పరిధిలో కమర్షియ ల్, రెసిడెన్షియల్, నిర్మాణాలు వాటి ప న్నుల వివరాలు సమగ్ర వివరాలు అం దించాలన్నారు. నూతనంగా నిర్మించిన ప్రతి కట్టడానికి పన్ను మదింపు చేయాలన్నారు. పెండింగ్‌లోని మ్యుటేషన్, అసెస్మెంట్, బైఫర్కేషన్ ఫైళ్లను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. క్షేత్రస్థాయిలో ఆర్ఐలు, బిల్కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమాచారాన్ని నమోదు చేయా లని ఆదేశించారు. పన్నులు వసూళ్లు వంద శాతం పూర్తయ్యేలా డిప్యూటీ కమిషనర్లు పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో అదన పు కమిషనర్ నాగేశ్వర్, డిప్యూటీ కమిషనర్లు రవీందర్ యాదవ్, జోనా, పన్నుల అధికారి శాంతికుమార్, ఐటీ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల పరిశీలన..
గ్రేటర్ పరిధిలోని పలు డివిజన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులను కమిషనర్ ప్రావీణ్య పరిశీలించారు. 57వ డివిజన్లోని వాజ్పాయ్కాలనీలో పట్టణ ప్రగతి నిధులతో చేపట్టిన శ్మశాన వాటిక అభివృద్ధి పనులను పరిశీలించారు. అ నంతరం 6వ డివిజన్ పరిధిలోని కిషన్‌పురాలో పూర్తయిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పురోగతిలో ఉన్న అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. బల్దియా ఈఈ శ్రీనివాస్‌రావు, డీఈలు, ఏఈలు ఉన్నారు.