చెన్నారావుపేట, సెప్టెంబర్ 30 : రైతుల శ్రేయస్సే ప్రధా న ఎజెండా అని, అందరి సహకారంతో సహకార సంఘా న్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామని చెన్నారావుపేట సొసైటీ చైర్మన్ ముద్దసాని సత్యనారాయణరెడ్డి అన్నా రు. గురువారం మండల కేంద్రంలోని సొసైటీ ఆవరణలో సంఘం 66వ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్‌బంక్ ద్వారా నెలకు రూ. లక్ష వరకు ఆదాయం వ స్తున్నదన్నారు. మార్చి నెలాఖరు లోగా సొసైటీ అభివృద్ధికి రూ. 35 కోట్లు మంజూరు చేస్తానని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బాదావత్ విజేందర్, జడ్పీటీసీ బానోత్ పత్తినాయక్, సర్పంచ్ల ఫో రం మండలాధ్యక్షుడు కుండె మల్లయ్య, ఉపాధ్యక్షులు చిం తకింది వంశీ, సొసైటీ సీఈవో చిట్టె రవి, డైరెక్టర్లు మజ్జిగ రాంబాబు, ఎండీ బషీర్, జంగిలి బాబు, జున్నూతుల ర మ, కంచ రాంచంద్రయ్య, మంచాల సరిత, బానోత్ ఫూల్శంకర్, రాధారపు సాంబారెడ్డి, ఎడ్ల మంజుల, గూళ్ల కవిత, ఇస్లావత్ గోపి పాల్గొన్నారు. కాగా, ఎల్లాయగూడెంలో గోదాం నిర్మించాలని సర్పంచ్ మంద జయజనార్ధన్, ఉప సర్పంచ్ కందికొండ విజయ్‌కుమార్ సత్యనారాయణరెడ్డికి వినతిపత్రం ఇచ్చారు.
విక్రయ కేంద్రాల ఏర్పాటు..
అమీనాబాద్ సొసైటీ పరిధిలో ప్రజల సౌకర్యార్థం 3 ఎరువుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, నాబార్డ్ ఆర్థికసాయంతో అమీనాబాద్‌లో నూతన భవనం నిర్మిస్తామని సొసైటీ అధ్యక్షుడు మురహరి రవి అన్నారు. సొసైటీ ఆవరణలో 66వ మహాసభ నిర్వహించారు. కార్యక్రమంలో పత్తినాయక్‌తండా, ఖాదర్‌పేట సర్పంచ్‌లు జాటోతు స్వామినాయక్, అనుముల కుమారస్వామి, సొసైటీ ఉపాధ్యక్షుడు పెండ్లి మల్లయ్య, డైరెక్టర్లు ముస్కు ఐలయ్య, దొంతరబోయిన కొమ్మాలు, భూక్యా హుస్సేన్, మాదారపు నర్సయ్య, అలువాల శాంతమ్మ, బండి స్వరూప, గడ్డల స్వరూప, అనుముల యాకాంతం, అనుముల రవి, మల్లాడి వీరారెడ్డి, సీఈవో నార్లాపురపు ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
దుగ్గొండి : సహకార సంఘం అభివృద్ధికి సభ్యులు సహకరించాలని మందపల్లి పీఏసీఎస్ చైర్మన్ గుడిపల్లి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మందపల్లి పీఏసీఎస్ సంఘ మహాజన సభ నిర్వహించారు. సంఘం గణకుడు సంఘం ఆర్థిక లా వాదేవీలను చదివి వినిపించారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ.. రైతుల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా సభ్యులు పని చేయాలన్నారు. రైతులు సకాలంలో పంట రుణాలను రె న్యువల్ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ సింగతి కార్తీక్, డైరెక్టర్లు మేదరి మొగిలి, నునావత్ రవికుమార్, సద్ది అయిల్‌రెడ్డి, అంకేశ్వరుపు జ్యోతి, గొర్రె యు గేంధర్, సీఈవో పూర్ణచందర్, సిబ్బంది రంగు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
సంఘాల బలోపేతంతోనే రైతులకు లాభం..
గీసుగొండ : సహకార సంఘాలు బలోపేతం అయితేనే రైతులకు లాభం చేకూరుతుందని జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి అన్నారు. మండలంలోని ఊకల్ రైతు సహకా ర సంఘం మహాజన సభ చైర్మన్ మండల వీరస్వామి అ ధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ.. రైతులు రుణాలు తీసుకోవడంతో పాటు డిపాజిట్లు చేయాలని సూచించారు. రైతులు బ్యాంకులో నిల్వ చేసిన మూలధనానికి యూనియన్ బ్యాంకు డబుల్ రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నదన్నారు. రైతులు సొసైటీ లో డిపాజిట్ చేస్తే 9 శాతం వడ్డీ ఇస్తామన్నారు. ఎకరాకు రూ.20 వేల రుణం తీసుకునే పద్ధతి మానుకొని రూ. 2 నుంచి రూ 5 లక్షల వరకు రుణం తీసుకునే స్థాయికి ఎ దగాలన్నారు. రుణమాఫీ డబ్బులు త్వరలోనే రైతుల ఖా తాల్లో జమ అవుతాయని, ఆందోళన చెందొద్దన్నారు. రానున్న ఏడాదిలో ఊకల్ సహకార సంఘం ద్వారా రైతులు వంద కోట్ల రుణాలు పొందాలని సూచించారు. కార్యక్రమంలోయూనియన్బ్యాంకు చీఫ్ మేనేజర్ వెంకటేశ్వర్రావు, ఊకల్ సహకార సంఘం మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్‌రెడ్డి, వైస్ చైర్మన్ చల్లా కృష్ణారెడ్డి, డైరెక్టర్లు జనార్దన్‌రెడ్డి, మేకల రాజ్‌కుమార్, ఇంజం వెంకట్రావ్, మండల రవి, భూక్యా నిమ్మ, బీ రమేశ్, పాపయ్య, రవి పాల్గొన్నారు.