దేవరుప్పుల, ఆగస్టు 10 : మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికిగాను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నిధులు మంజూరు చేయించారని జడ్పీటీసీ పల్లా భార్గవిరెడ్డి, ఎంపీపీ బస్వ సావిత్రి తెలిపా రు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. ఉపాధిహామీ నిధుల నుంచి రూ.9.1 కోట్లు, ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్(ఎస్టీఎస్డీఎఫ్) నుంచి రూ. 1.6 కోట్లు, పంచాయత్‌రాజ్‌శాఖ నుంచి బీటీ రోడ్ల రెన్యువల్‌కు రూ. 63.60 లక్షలు మంజూరయ్యాయని చెప్పారు. మండలంలో ఇప్పటికే రూ.100 కోట్లతో పలు అభివృద్ధి పనులు జరిగాయని, మరిన్ని నిధులతో అన్నిరకాల అభివృద్ధి పనులు జరుగుతాయని వివరించారు. వా గులపై రూ. 40 కోట్లతో తొమ్మిది చెక్‌డ్యాములు నిర్మించడంతో సాగునీటి సమస్య తీరిందన్నారు. గ్రామాల్లో అన్ని వీధులకు సీసీ రోడ్లు, మిషన్ భగీరథలో ఇంటింటికీ తాగునీరు, అన్ని గ్రామాలను కలుపుతూ అంతర్గత బీటీ రోడ్ల ని ర్మాణం పూర్తయిందని వారు తెలిపారు.
రూ.9.1 కోట్లతో సీసీ డ్రైన్లు మంజూరవగా మండల పరిధిలోని 32 గ్రామాలకు నిధులు కేటాయించామన్నారు. బీటీ రెన్యువల్స్‌లో సీతారాంపురం నుంచి కోలుకొండ వరకు రూ.18.96 లక్షలు, పెదమడూరుకు రూ.19.36 లక్షలు, చినమడూరు-బంజరకు రూ. 25.25 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. బీటీ రోడ్లలో భా గంగా దేవరుప్పుల-బోడకుంట తండా-కాశవాడకు రూ. 20 లక్షలు, పొట్టిగుట్ట తండా- కడవెండి- దుబ్బతండాకు రూ. 20 లక్షలు, మాల్యాతండాకు రూ. 20 లక్షలు, పాముల బాయితండాకు రూ. 20 లక్షలు, ధరావత్ తండా- కొత్తతండాకు రూ. 20 లక్షలు, ధర్మగడ్డ తండా- దొడ్ల బండ తండాకు రూ. 20 లక్షలు, దుబ్బ తండాకు రూ.20 లక్షలు, గోప్యానాయక్ తండాకు రూ. 20 లక్షలు మంజూరయ్యాయని వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో కామారెడ్డిగూడెం, ధర్మగడ్డతండా సర్పంచ్‌లు బిళ్ల అంజమ్మ, గుగులోత్ సునీత పాల్గొన్నారు.