దుగ్గొండి, డిసెంబర్ 30: పల్లెలు దేశానికి పట్టుగొమ్మలని భావించిన సీఎం కేసీఆర్ మౌలిక వసతుల కల్పనకు వెల్లవలా నిధులు మంజూరు చేస్తున్నారు. దీంతో వీధివీధినా సీసీరోడ్లు వేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా అధ్వానంగా ఉన్న అంతర్గత రహదారులు అద్దంలా తయారవుతున్నారు. దీంతో పల్లెల్లో సైతం రవాణా సౌకర్యాలు మెరుగుపడుతున్నాయి. గ్రామాల్లోని ప్రతి వీధిలో సీసీరోడ్ల నిర్మాణమే ధ్యేయంగా ప్రజాప్రతినిధులు పనులు ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం దుగ్గొండి ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య దేశాయిపల్లిలో బతుకమ్మ ఆడుకునే స్థలం వరకు రూ. 5 లక్షలతో సీసీరోడ్డు నిర్మాణ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రోడ్ల నిర్మాణమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నదని ఆమె అన్నారు. పల్లెప్రగతి పనులను వందశాతం పూర్తి చేసి గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని పంచాయతీ పాలకవర్గం, కార్యదర్శులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కృష్ణప్రసాద్, ఎంపీవో శ్రీధర్‌గౌడ్, పీఆర్ ఏఈ వెంకటేశ్వర్లు, సర్పంచ్‌లు రేవూరి సురేందర్‌రెడ్డి, పాశం పోశాలు, ఎంపీటీసీలు మోర్తాల రాజు, మామునూరు సుమన్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సుకినె రాజేశ్వర్‌రావు, గుండెకారి రంగారావు, నల్లబెల్లి శోభన్, శ్రీశైలం పాల్గొన్నారు.
మౌలిక వసతుల కల్పనకు సర్కారు కృషి
నెక్కొండ: గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎంపీపీ జాటోత్ రమేశ్ అన్నారు. మడిపెల్లిలో సీసీరోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అందిస్తున్న నిధులతో ప్రతి కాలనీలో సీసీరోడ్లు నిర్మించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్ము రమేశ్‌యాదవ్, దీక్షకుంట ఎంపీటీసీ లింగాల అజయ్, మడిపెల్లి సర్పంచ్ స్వాతి రమేశ్, ఎంపీటీసీ కవితా గోపీనాయక్, కస్నాతండా సర్పంచ్ రవినాయక్, ఉప సర్పంచ్ రామ్‌నాయక్, టీఆర్ఎస్ మండల నాయకుడు బక్కి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
జీపీలను ఆదర్శంగా తయారు చేయాలి
వర్ధన్నపేట: మండలంలో నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీలను ఆదర్శంగా తయారు చేయాలని జడ్పీటీసీ మార్గం భిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్ కౌడగాని రాజేశ్‌ఖన్నా, మాజీ ఏఎంసీ చైర్మన్ గుజ్జ సంపత్‌రెడ్డి అన్నారు. మండలంలోని రామోజీ కుమ్మరిగూడెంతండాలో సీసీరోడ్డు పనులను వారు ప్రారంభించి మాట్లాడారు. ఎమ్మెల్యే అరూరి రమేశ్ పల్లెల అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయిస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో సర్పంచ్, ఎంపీటీసీ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి పాల్గొన్నారు.
ఇటికాలపల్లిలో పనులు ప్రారంభం
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి సహకారంతో మంజూరైన రూ. 5 లక్షల ఎంపీటీసీ నిధులతో ఇటికాలపల్లిలో సీసీరోడ్ల నిర్మాణ పనులను ఎంపీపీ మోతె కళావతి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నామాల సత్యనారాయణ, జడ్పీటీసీ కోమాండ్ల జయగోపాల్రెడ్డి ప్రారంభించారు. పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహరాములు, సర్పంచ్ మండల రవీందర్, చంద్రయ్యపల్లె ఎంపీటీసీ పెద్ది శ్రీనివాసరెడ్డి, పార్టీ గ్రామ అధ్యక్షుడు పిట్టల శ్రీనివాస్, ఉపసర్పంచ్ చంద్రమౌళి, మండల ప్రధాన కార్యదర్శి రాము, రాజేశ్వరరావు, రజిత, ఆనంద్, నాగరాజు, పద్మ, హైమావతి పాల్గొన్నారు.