ఖానాపురం, అక్టోబర్ 1: జిల్లావ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఖానాపురం మండలం వేపచెట్టుతండాలో స్పెషల్ డ్రైవ్‌ను శుక్రవారం ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారిని తరిమేందుకు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ భూక్యా పద్మావతి, కాస ప్రవీణ్‌కుమార్, వెంకన్న, సొసైటీ వైస్ చైర్మన్ దేవినేని వేణుకృష్ణ, కార్యదర్శి సుధాకర్, ఏఎన్ఎం కనకలక్ష్మి, సరోజన, విజయ పాల్గొన్నారు.
కోటలో వ్యాక్సినేషన్ వేగవంతం
ఖిలావరంగల్: వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ ఖిలావరంగల్, చింతల్ ప్రాంతాల్లోని రెండు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధ్వర్యంలో వేగంగా కొనసాగుతున్నది. రోజు సుమారు ఆరు వందల నుంచి వెయ్యి మందికి టీకాలు వేస్తున్నారు. శుక్రవారం వరకు కోటలోని పీహెచ్సీ పరిధిలో తొమ్మిది వేల పైచిలుకు టీకాలు వేశారు. తూర్పుకోట, మధ్యకోట, పడమరకోట, పీహెచ్సీ, గిరిప్రసాద్‌నగర్, శివనగర్, చింతల్ ప్రాంతాల్లో ప్రత్యేక వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వందశాతం దిశగా ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ 18 ఏళ్లు దాటిన వారిని వ్యాక్సిన్ కేంద్రానికి తరలిస్తున్నారు. వందశాతం పూర్తి చేసుకున్న వీధుల్లో వైద్య సిబ్బందితోపాటు టీఆర్ఎస్ నాయకులు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఆయా డివిజన్లలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రాలను 34, 35, 37, 38 డివిజన్ల కార్పొరేటర్లు దిడ్డి కుమారస్వామి, సోమిశెట్టి ప్రవీణ్, బోగి సువర్ణ, బైరబోయిన ఉమ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
వంద శాతం పూర్తి చేయాలి
నర్సంపేట రూరల్: గ్రామంలో వందశాతం కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని దాసరిపల్లి సర్పంచ్ శ్రీనివాస్ కోరారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్థానికులకు శుక్రవారం కరోనా టీకాలు వేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, కార్యదర్శి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా అన్ని గ్రామాల్లోని సబ్సెంటర్లలో వ్యాక్సిన్ వేశారు.
ప్రజల్లో పెరిగిన అవగాహన
గీసుగొండ: కరోనా వ్యాక్సిన్‌పై ప్రజల్లో అపోహలు తొలగిపోయినట్లు సర్పంచ్ అంకతి నాగేశ్వర్రావు అన్నారు. గంగదేవిపల్లి, దస్రుతండా, విశ్వనాథపురంలో వందశాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయినట్లు వైద్యాధికారి మాధవీలత తెలిపారు. శుక్రవారం విశ్వనాథపురం, కొమ్మాల గ్రామస్తులు కరోనా వ్యాక్సిన్ వేసుకున్నారు. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ మాస్కులు ధరించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎన్ఎం సరస్వతి, సిబ్బంది జ్యోతి, వార్డు సభ్యుడు శ్రీనివాస్, స్థానికులు సురేందర్, రాజు, బుచ్చన్న పాల్గొన్నారు.
సంగెం: మండలంలో కరోనా టీకాల కార్యక్రమం కొనసాగుతున్నది. శుక్రవారం బాలునాయక్‌తండాలో 210 మందికి వ్యాక్సిన్ వేసినట్లు సర్పంచ్ రజిని తెలిపారు. కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు రాము, ఏఎన్ఎం నిర్మలాజ్యోతి, సంధ్య, కార్యదర్శి పాల్గొన్నారు.