కాశీబుగ్గ, ఆగస్టు 31: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారి టెండర్లలో కాటన్ ఇండస్ట్రీస్ వారు పాల్గొనడం లేదని తెలంగాణ కాటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో 2021-22 కాటన్ సీజన్‌పై అగ్రికల్చరల్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్, డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ శాఖ సంయుక్తంగా సమావేశం ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా బొమ్మినేని మాట్లాడుతూ కాటన్ ఔటన్, కాటన్ సీడ్ లిఫ్టింగ్, ట్రాష్ పర్సంటేజ్‌పై సీసీఐతోపాటు మార్కెటింగ్ శాఖ అధికారులకు వివరించారు. అలాగే, కాటన్ ఇండస్ట్రీస్ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్తామన్నారు. అనంతరం వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్‌రావు, హన్మంతు, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయికి పుష్పగుచ్ఛాలు అందజేశారు. సమావేశంలో అడిషనల్ డైరెక్టర్ లక్ష్మణుడు, జాయింట్ డైరెక్టర్ రవికుమార్, సీసీఐ మేనేజర్లు, అధికారులు, మార్కెట్ కమిటీ కార్యదర్శులు కాటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కక్కిరాల రమేశ్, జాయింట్ సెక్రటరీ కట్కూరి నాగభూషణం పాల్గొన్నారు.
తోడ్పాటునందించాలి..
రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని బొమ్మినేని రవీందర్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేశారు. ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద వ్యవసాయ మార్కెటైన ఎనుమాములలో సుమారు 50 వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నట్లు తెలిపారు. కార్మికులు, రైతులు వ్యాపారుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని వారి సంక్షేమం కోసం తోడ్పాటునందించాలని కోరారు. కార్యక్రమంలో చాంబర్ ప్రధాన కార్యదర్శి మాడరి వేదప్రకాశ్, సాగర్ల శ్రీనివాస్, అల్లె సంపత్, కైలాస హరినాథ్, గాజుల సుమన్, వెల్ది చక్రధర్ పాల్గొన్కారు.
బొమ్మినేని రవీందర్‌రెడ్డికి సన్మానం
వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడిగా ఎన్నికైన బొమ్మినేని రవీందర్‌రెడ్డిని పలువురు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో చాంబర్ కార్యాలయంలో సత్కరించారు. కార్యక్రమంలో రెడ్డి జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపు జైపాల్‌రెడ్డి, నల్ల రాజిరెడ్డి, రావుల నర్సింహారెడ్డి, కామిడి సతీశ్‌రెడ్డి, గంగిడి ప్రభాకర్‌రెడ్డి, చాడ జైహింద్‌రెడ్డి, రాధారపు సంజీవరెడ్డి, కేతిరి దామోదర్‌రెడ్డి పాల్గొన్నారు. అలాగే, బీజేపీ నాయకుడు చింతాకుల సునీల్, కార్పొరేటర్ చింతాకుల అనిల్, మాజీ కార్పొరేటర్ కుసుమ సతీశ్, పరమేశ్వర్ తదితరులు సన్మానించారు. గోవిందరాజులగుట్ట బొడ్రాయి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సత్కరించారు.