పాలకుర్తి, ఆగస్టు 24 : సోమవారం నాడు సంత అనగానే అందరికీ గుర్తుకొచ్చేది పాలకుర్తి అంగడి. ఇక్కడ పెద్దఎత్తున జరిగే మేకలు, గొర్ల క్రయవిక్రయాల కోసం జనగామ, వరంగల్ నుంచే గాక ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, మెదక్ నుంచి కూడా పెద్దసంఖ్యలో వస్తుంటారు. ప్రధానంగా పండుగలు, శుభకార్యాల సీజన్లలో జోరుగా సాగుతుంటాయి. అలాగే పశువులను కూడా ఇక్కడికి తీసుకొచ్చి కొని, అమ్ముతుంటారు. వ్యవసాయ సీజన్ ప్రారంభంలో మండలం నుంచే గాక ఇతర జిల్లాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పశువులను కొంటుంటారు.
వేల నుంచి లక్షల్లో ఆదాయం
పాలకుర్తి సంత 32 ఏళ్ల కిందట ప్రారంభమైంది. మండలంలోని ప్రజలకు చేరువలో సంత ఉండాలనే సంకల్పంతో 1989 సంవత్సరంలో స్థానిక ఊరచెరువు సమీపంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో 2-43 గుంటల భూమిని కొనుగోలు చేశారు. దాన్ని గ్రామ పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్ చేసి, వా రాంతపు సంతను ప్రారంభించారు. మొ దట్లో ఈ అంగడికి ఉమ్మడి వరంగల్ జిల్లాల నుంచి వ్యాపారులు, వినియోగదారులు పెద్దసంఖ్యలో వచ్చేవారు. కాలక్రమంలోనూ ఇదే తరహాలో అంగడి కిటకిటలాడింది. ఏర్పాటైన తొలి ఏడాది(1989)లో సంతకు రూ.12,625 ఆదాయం రాగా, దినదిన ప్రవర్ధమానంగా ఇది పెరుగుతూ లక్షలకు చేరింది. నేటికీ పాలకుర్తి మండలంలోని ప్రజలకు ఈ వారాంతపు సంతే పెద్ద దిక్కు. మండలవాసులు వారానికి సరిపడా సరుకులను ఇక్కడే కొనుక్కుంటారు.
మంత్రి సహకారంతో అభివృద్ధికి కృషి
పాలకుర్తి సంతలో అభివృద్ధి పనులకు నిధుల మం జూరుపై పంచాయతీరాజ్ శాఖ మం త్రి ఎర్రబెల్లి దయాకర్రావు సానుకూలంగా స్పందించారు. సంతకు స్థలం కొరత దృష్ట్యా.. దీని పరిధిలో నివాసం ఏర్పాటు చేసుకున్న ఇద్దరికి డబుల్బెడ్రూమ్ ఇళ్లలో అవకాశం కల్పిం చాం. మరొకరికి డబ్బులు కేటాయిస్తాం. సంత స్థలం హద్దుల ఏర్పాట్ల అంశాన్ని తాసిల్దార్ దృష్టికి తీసుకెళ్లి పూర్తి సర్వే చేయిస్తాం. చుట్టూ కంచె ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం. పూర్తి స్థాయిలో షెడ్లను నిర్మించే ప్రణాళికలను రూపొందిస్తున్నాం. సంతలో ప్రత్యేకంగా రైతుబజార్ తరహాలో కూరగాయల మార్కెట్ నిర్మిస్తాం.