నల్లబెల్లి, సెప్టెంబర్ 30: జిల్లాలో డ్రాగన్ ప్రూట్ సాగు ను విస్తరించేలా చర్యలు చేపడుతామని కలెక్టర్ బీ గోపి అన్నారు. మండలంలోని నారక్కపేట, అర్శనపెల్లి, కొండాపూర్ గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించా రు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో సాగు చేస్తున్న డ్రా గన్ ప్రూట్ పంట సాగుతోపాటు పలురకాల పంట క్షేత్రా లను పరిశీలించారు. కొండాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి మొక్కలు నాటారు. ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేశారు. వ్యాక్సినేష న్ సెంటర్‌ను సందర్శించి ప్రక్రియ గురించి వైద్య సిబ్బం దితోపాటు అధికారులను ఆరా తీశారు. అనంతరం కలెక్ట ర్ గోపి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ భూములు డ్రాగన్ ప్రూట్ పంట సాగుకు అనువైనవని, అందులో వరంగల్ జిల్లాలో ఉన్న భూములు మరింత అనుకూలమని అన్నారు. జిల్లాలో అత్యంత లాభసాటిగా ఉండే డ్రాగన్ ప్రూట్ సాగును విస్తరించేందుకు ఉద్యాన శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రైతులు పంట మార్పిడి విధానాన్ని అవలంబిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు నని తెలిపారు. మండలంలో చేపట్టిన పల్లెప్రగతి పనుల ను పరిశీలించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. మండ లంలో వంద శాతం కరోనా వ్యాక్సినేషన్ పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రధానం గా కరోనా నేపథ్యంలో పాఠశాలల్లో మౌలిక వసతుల ఏ ర్పాటులో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయు లు అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిం చారు. బృహత్ పల్లెప్రకృతి వనంలో అన్ని రకాల మొక్క లు నాటి, వాటిని సంరక్షించడంలో అధికారులు, ప్రజాప్ర తినిధులు ముందుండాలని తెలిపారు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాసరావు, ఏపీడీ సాయిచరణ్, ఎంపీ పీ ఊడుగుల సునీత, తహసీల్దార్ ప్ర వీణ్‌కుమార్, ఎంపీ డీవో విజయ్‌కుమార్, ఎంపీవో కూచన ప్రకాశ్, హార్టికల్చ ర్ అధికారి తిరుపతి, ఏపీవో వెంకటనారాయణ, సర్పం చులు తిప్పని సృజన, వక్కల మల్లక్క, గూబ తిరుపతమ్మ, ఆయా గ్రామాల కార్యదర్శులు, రైతులు పాల్గొన్నారు.
నేటి నుంచి జిల్లాలో స్వచ్ఛభారత్
ఖిలావరంగల్: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా నేటి నుంచి స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వ హిస్తున్నట్లు కలెక్టర్ గోపి తెలిపారు. ఈ నెల 31 వరకు పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రతకు ప్రాధా న్యతను ఇచ్చే కార్యక్రమాలుంటాయని తెలిపారు. ప్రభుత్వ భవనాలు, పాఠశాలలు, రైల్వే స్టేషన్లు, బ స్టాండ్లు, పార్కులు, రోడ్లు, వ్యాపార సముదాయాలు, కుంటలు, చెరువులు, పర్యాటక ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడానికి శ్రీకారం చుట్టామన్నారు. విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.