వర్ధన్నపేట, సెప్టెంబర్ 7: పలు మండలాల్లో మంగళవారం టీఆర్ఎస్ నూతన గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వర్ధన్నపేట ఎంపీపీ అన్నమనేని అప్పారావు సమక్షంలో చెన్నారం, కాశగూడెం, ఉప్పరపల్లి గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు. చెన్నారం అధ్యక్షుడిగా మంద నర్సయ్య, ప్రధాన కార్యదర్శిగా జన్ను బాబు, కాశగూడెం అధ్యక్ష, కార్యదర్శులుగా ఎండీ సమీర్, ఎస్డీ హైదర్, ఉప్పరపల్లి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా దాడి రాజు, సీనపెల్లి అంబేద్కర్ ఎన్నికయ్యారు. జడ్పీటీసీ భిక్షపతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కుమారస్వామి, ఆత్మ చైర్మన్ గోపాల్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్‌ఖన్నా తదితరులు పాల్గొన్నారు.
పర్వతగిరి: టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రంగు కుమార్ సమక్షంలో పార్టీ చౌటపెల్లి అధ్యక్షుడిగా మిట్టపల్లి వంశీరావు, ఉపాధ్యక్షుడిగా గౌరారపు కుమారస్వామి, ప్రధాన కార్యదర్శిగా దామెర సారంగం, శ్రీనగర్ అధ్యక్షుడిగా గుమ్మడి శ్రీను, ఉపాధ్యక్షుడిగా తూమాటి భద్రయ్య, ప్రధాన కార్యదర్శిగా చెరుకూరు ప్రసాదరావును నియమించారు. జడ్పీటీసీ సింగ్‌లాల్, పీఏసీఎస్ చైర్మన్ దేవేందర్, ఏఎంసీ డైరెక్టర్లు శాంతిరతన్‌రావు, ఏకాంతం, యుగేంధర్‌రావు, ఎంపీటీసీలు మల్లయ్య, భాస్కర్ పాల్గొన్నారు.
సంగెం: రైతుబంధు సమితి మండల కన్వీనర్ కందకట్ల నరహరి సమక్షంలో టీఆర్ఎస్ సంగెం, కుంటపల్లి నూతన కమిటీలను ఎన్నుకున్నారు. సంగెం అధ్యక్షుడిగా అప్పె నాగార్జునశర్మ, ఉపాధ్యక్షులుగా బిట్ల రామకృష్ణ, కోడూరి సంపత్, రాయపురం మల్లయ్య, రావుల సూరయ్య, మహంకాళి మొగిళి, ప్రధాన కార్యదర్శిగా ఉండీల మల్లికార్జున్, సంయుక్త కార్యదర్శిగా రావుల కిరణ్, తాటికొండ కృష్టయ్య, కోశాధికారిగా కక్కెర్ల అనూషారాణి, కుంటపల్లి అధ్యక్షుడిగా పురం శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా పొన్నాల నర్సిరెడ్డి, పులిపాటి లింగమూర్తి, గోపతి రాజు, చిర్ర ప్రకాశ్, ఎనబోతుల వెంకటేశ్వర్లు, ప్రధానగా కార్యదర్శి చిర్ర గోపి, సంయుక్త కార్యదర్శిగా నిమ్మనబోయిన ఐలయ్య, గాదె ఇంద్రయ్య, కోశాధికారిగా పెండ్లి పద్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీల బాధ్యులకు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.