సంగెం, సెప్టెంబర్ 11 : టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పసునూరి సారంగపాణి, కందకట్ల నరహరి సమక్షంలో పెద్దతండా, లోహిత, పల్లార్గూడ, చింతలపల్లి గ్రామ కమిటీలను శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పెద్దతండా అధ్యక్షుడిగా గుగులోత్ భిక్షపతి, ఉపాధ్యక్షులుగా గుగులోత్ దేవేందర్, గుగులోత్ భిక్షపతి, కార్యదర్శిగా గుగులోత్ వెంకన్న, సంయుక్త కార్యదర్శిగా భూక్యా వరదరాజు, కోశాధికారిగా గుగులోత్ సుగుణమ్మ, లోహిత గ్రామ అధ్యక్షుడిగా పోగుల ఎల్లస్వామి, ఉపాధ్యక్షులుగా దేవ రవి, బొమ్మెర ఎల్లయ్య, దొమ్మటి విజేందర్, కార్యదర్శిగా చెరకు యాదగిరి, సంయుక్త కార్యదర్శిగా బుద్దినేని జితేందర్‌రావు, మడిపల్లి రమేశ్, కోశాధికారిగా అడ్డగట్ల రాజు, చింతలపల్లి గ్రామ అధ్యక్షుడిగా వేల్పుల కుమారస్వామి, ఉపాధ్యక్షుడు అల్లెపు మల్లేశ్, కొప్పుల రమేశ్, చెల్పూరి అశోక్, చిర్ర మూర్తి, ప్రధానకార్యదర్శి దాసరి రాజు, సంయుక్త కార్యదర్శి బోడ రాంజీ, కోశాధికారిగా చాపర్తి అనసూయ, పల్లార్గూడ గ్రామ అధ్యక్షుడిగా ఎండీ మైమొద్దీన్, ఉపాధ్యక్షులుగా ఊరటి కొమురెల్లి, కోడూరి ప్రవీణ్, గుగులోత్ దేవ్‌సింగ్, బొమ్మాల రమేశ్, పోశాలు రాములు, ప్రధాన కార్యదర్శిగా గన్నారపు అశోక్, కోశాధికారిగా టెంకురాల శోభారాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
వర్ధన్నపేట : మండలంలోని ల్యాబర్తి, రాంధాన్తండా, రామవరం గ్రామంతో పాటుగా వర్ధన్నపేట పట్టణంలోని పలు డివిజన్ల టీఆర్ఎస్ కమిటీలను ఎన్నుకున్నారు. ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ నూతన కమిటీలను ప్రకటించారు. ల్యాబర్తి గ్రామ అధ్యక్షుడిగా గుడికందుల రాజు, ప్రధాన కార్యదర్శిగా మారపెల్లి ఎల్లయ్య, రాంధాన్తండా అధ్యక్ష, కార్యదర్శులుగా గుగులోత్ భాస్కర్, బానోత్ వెంకన్న, బొక్కలగూడెం గ్రామ అధ్యక్ష, కార్యదర్శులుగా మల్లూరి సాగర్, ఆకుల రాములును ఎన్నుకున్నట్లు ప్రకటించారు. వర్ధన్నపేట పట్టణంలోని 8వ డివిజన్ నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా బక్కతట్ల రాజు, పూజారి శ్రీనివాస్, 12వ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులుగా నక్క రాజు, శివరాత్రి ఎల్లస్వామిని ఎన్నుకున్నారు. కార్యక్రమాల్లో ఆత్మ చైర్మన్ గుజ్జ గోపాల్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్‌ఖన్నా, ఏఎంసీ మాజీ చైర్మన్ గుజ్జ సంపత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.