జనగామ రూరల్, ఆగస్టు 6 : గొర్రెలు, మేకల పెంపకందారులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తున్నదని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి యార నర్సయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని పెంబర్తి, ఓబుల్ కేవ్వాపూర్, వెంకిర్యాల గ్రామాల్లో జీవాలకు నట్టల నివారణ మందు పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవాలకు నట్టల నివారణ మందు వేయించకుంటే వాటిలో రోగనిరోదకశక్తి తగ్గి అనారోగ్యానికి గురవుతాయన్నారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ అంబాల ఆంజనేయులు, ఎంపీటీసీ మూల రవి, మండల పశువైద్యుడు రాజశేఖర్, పీఏసీఎస్ చైర్మన్, ఎన్ మహేందర్‌రెడ్డి, జూనియర్ వెటర్నరీ వైద్యుడు హఫీజ్, అసిస్టెంట్ అనిల్, నజీర్, బండ్రు సిద్ధులు, ఆకుల శ్రవణ్‌కుమార్ పాల్గొన్నారు.
నర్మెటలో..
నర్మెట : గొల్ల, కురుమలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎంపీపీ తేజావత్ గోవర్ధన్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో గొర్రె లు, మేకలకు నట్టల నివారణ మందును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ముక్కెర యాదమ్మ, పీఏసీఎస్ ఛైర్మన్ నక్కల గట్టయ్య, మండల పశువైద్యాధికారి నేహ, వైద్యులు శశిధర్, యాదవ సంఘ సభ్యులు అం జయ్య, వెంకటయ్య, సిద్ధులు, రాజు పాల్గొన్నారు.
దేవరుప్పులలో..
దేవరుప్పుల : రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పెంపకందారులకు రాయితీలు కల్పిస్తూ వారి జీవనోపాధికి కృషి చేస్తున్నదని సర్పంచ్ కోనేటి సుభాషిణి అన్నారు. మండలంలోని గొల్లపల్లిలో శుక్రవారం గొర్రెలకు నట్టల నివారణ మందు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల పశువైద్యాధికారి అనూషతో కలిసి సుభాషిణి మాట్లాడారు. జీవాలకు నట్టల నివారణ మందు వేయడం ద్వారా ఆరోగ్యంగా ఉంటాయని, రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు.
కొడకండ్లలో..
కొడకండ్ల : మండలంలోని మొండ్రాయిలో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ జ్యోతి రవీంద్రగాంధీనాయక్ మాట్లాడుతూ జీవాలకు నట్టల నివారణ మందు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఊర్మిల, డాక్టర్ సృజన, సుధాకర్, కుమార్, రమేశ్, విమల పాల్గొన్నారు.
స్టేషన్‌ఘన్‌పూర్‌లో..
స్టేషన్ ఘన్పూర్ : గొల్ల కురుమలు జీవాలకు నట్టల నివారణ మందు వేయించాలని స్థానిక సర్పంచ్ తాటికొం డ సురేశ్‌కుమార్ కోరారు. శుక్రవారం మండల కేంద్రంలో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు పంపిణీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ బీ వినయ్, ఎంపీటీసీ గన్ను నర్సింహులు, మునిగల రాజు, పశుసంవర్ధశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ చక్రధర్‌రావు పాల్గొన్నారు.
చిల్పూరులో..
చిల్పూరు : మండలంలోని మల్కాపూర్‌లో శుక్రవారం సర్పంచ్ కొంగరి రవి పశువైద్యాధికారి ప్రియాంకతో కలిసి జీవాలకు నట్టల నివారణ మందు వేశారు. సర్పంచ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పెంపకందారుల అభివృద్ధికి చర్యలు తీసుకుందన్నారు. అనంతరం కొండాపూర్‌లో సర్పంచ్ లోడం రజిత,ఎంపీటీసీ మారబోయిన మణెమ్మ ఆధ్వర్యంలో జీవాలకు నట్టల నివారణ మందు వేశారు.