నర్సంపేట, అక్టోబర్1: కేసీఆర్ సర్కారుతోనే సంక్షేమమని, టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై ఎంతో మంది గులాబీ దళంలో చేరుతున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో చెన్నారావుపేట మాజీ ఎంపీపీ జక్క అశోక్‌తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు 1000 మందికిపైగా ఆ పార్టీకి రాజీనామా చేసి పెద్ది సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గానికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చాలా ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయినా కోట్లాది రూపాయలు తీసుకొచ్చి ప్రజ ల తరఫున నిలబడి పోరాడుతూ వస్తున్నానని పేర్కొన్నారు. ప్రజా జీవితంలో గెలుపుఓటములు ముఖ్యం కాదని, ఎప్పు డూ ప్రజల్లోనే ఉండాలని అన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గంలో అభివృద్ధి జరుగలేదని ఇంతవరకు ఎవరూ విమర్శించలేదని అన్నారు. చెన్నారావుపేట మండలం లోని ప్రతి ఎకరాకు రెండు పంటల సాగు త్వరలో రానుందని అన్నారు. టీఆర్ఎస్ నియమాలకు కట్టుబడి విధేయతతో నమ్మ కంతో పార్టీకి ప్రజలకు సేవ చేయాలని పిలుపునిచ్చారు. కార్య కర్తలు పార్టీకి వెన్నెముకలాంటి వారని, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నారు. కార్యక్రమంలో ఆర్బీ ఎస్ రాష్ట్ర డైరెక్టర్ రాయిడి రవీందర్‌రెడ్డి, మండల శాఖ అధ్యక్షుడు బాల్నె వెంకన్న, సంగాని సూరయ్య, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ రఫీ, ఎంపీపీ బదావత్ విజేందర్, జడ్పీటీసీ సభ్యుడు పత్తినాయక్, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, ఆర్బీఎస్ కన్వీనర్లు, పీఏసీఎస్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, పార్టీ ముఖ్య నాయకులు కొమ్ము రమేశ్‌యాదవ్, తూటి శ్రీను, చెన్నారెడ్డి, కేతిడి వీరారెడ్డి, జున్నూతుల రాంరెడ్డి, కంది కృష్ణారెడ్డి, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
చెన్నారావుపేటలో భారీ ర్యాలీ
సీఎం కేసీఆర్ ప్రవేశపె ట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై సీనియర్ కాంగ్రె స్ నాయకుడు, మాజీ ఎంపీపీ జక్క అశోక్‌యాదవ్ వందలాది మంది కార్యకర్తలతో టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి శుక్రవారం మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని మండల శాఖ అధ్యక్షుడు బాల్నె వెంకన్నగౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. ఎంపీపీ బదావత్ విజేందర్, జడ్పీటీసీ బానోత్ పత్తి నాయక్, సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడు కుండె మల్లయ్య, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ రఫీ, మండ ల ఆర్బీఎస్ కన్వీనర్ బుర్రి తిరుపతి, మాజీ జడ్పీటీ సీ జున్నూతుల రాంరెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హోరెత్తించే డ్యా న్సులతో, పటాకులు పేలుస్తూ సుమారు 2000 ద్విచ క్రవాహనాలతో ర్యాలీ తీశారు. ఎమ్మెల్యే పెద్ది సమ క్షంలో చేరడానికి భారీగా తరలివెళ్లారు. దీంతో కాం గ్రెస్ కంచుకోట చెన్నారావుపేట మండలం నేడు దా దాపు ఖాళీ అయింది.