అనేక రంగాలు, సంస్థల్లో పనిచేసే వారికి ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) సౌకర్యం ఉంటుంది. దీంతో పలు ప్రభుత్వ పథకాలు వారికి అందుతాయి. కానీ లక్షలాది మంది కార్మికులు అసంఘటిత రంగాల్లో పనిచేస్తుండగా, వారికి ఎలాంటి పథకాలు, వసతులు వర్తించడం లేదు. అలాంటి వారందరికీ సంక్షేమ పథకాలు అందేలాప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతున్నది. WWW.ESHRAM. GOV.IN పోర్టల్‌లో తమ వివరాలను నమోదు చేసుకుంటే వారికి ఉచితవైద్యం, 2 లక్షల ప్రమాదబీమా అందిస్తున్నది. ఇందుకోసం కార్మికులకు అవగాహన సైతం కల్పిస్తున్నారు.
నమోదు చేసుకునేందుకు అర్హులు వీరే..
అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు నమోదు చేసుకునేందుకు అర్హులు. వారు 18-59 వయస్సు వారై ఉండా లి. ఆధార్‌నంబర్, ఆధార్ నంబర్‌కు లింక్ చేయబడిన ఫోన్ నంబర్, ఐఎఫ్‌సీ నంబర్‌తో కూడిన బ్యాంకు ఖాతా వివరాలను నమోదు చేసుకోవాలి. కుల ధ్రువీకరణపత్రం, చదువుకున్న వారయితే విద్యార్హతలకు సంబంధించిన పత్రాలు సైతం జతపరచాలి. WWW.ESHRAM. GOV.IN నందు వివరాలను నమోదు చేసుకోవాలి. బీడీ, నిర్మాణ రంగం కార్మికులు, వ్యవసాయ కూలీలు, దుకాణాల్లో పనిచేసే గుమస్తాలు, ఇతరత్రా కూలీలు పోర్టల్‌లో తమ వివరాలను నమోదు చేసు కోవచ్చు. ఆన్లైన్ సెంటర్ లేదా మీసేవ సెంటర్‌తోపాటు నేరుగా కూడా దరఖాస్తులు ఇవ్వవచ్చు. దీంతో కార్మికులు పలురకాల ప్రయోజనాలను పొందుతారు.
సద్వినియోగం చేసుకోవాలి
అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు WWW. ESHRAM.GOV.IN నందు తమ వివరాలను నమోదు చేసుకోవాలి. దీనిపై ప్రజలకు అవగాహన సైతం కల్పిస్తున్నాం. వివిధ రంగా ల్లో పనిచేస్తున్న కార్మికులు నమో దు చేసుకున్నట్లయితే వారికి ఉచితవైద్యంతో పాటు 2లక్షల ప్రమాద బీమా సైతం వర్తిస్తుంది. ఈ పథకాన్ని సద్వినియోగించుకోవాలి.