నర్సంపేట, ఆగస్టు 31: ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ జెండా ఎగురాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన నర్సంపేటలో విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ కేంద్ర కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న సందర్భంగా సెప్టెంబర్ 2న గులాబీ జెండాల ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టాలని పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారన్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని 179 గ్రామాలు, నర్సంపేట పట్టణంలోని 24 వార్డుల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టాలని కోరారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, లేకుంటే పార్టీ గ్రామ అధ్యక్షులు.. ఎవరుంటే వారి ద్వారా జెండా ఆవిష్కరణ చేయించాలని కోరారు. పట్టణంలో కూడా ఎవరి వార్డులో వారి కౌన్సిలర్, సీనియర్ నాయకులు, క్లస్టర్ ఇన్చార్జిలు జెండా పండుగలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. గురువారం ఉదయం 9 గంటలకు ప్రతి గ్రామం, పట్టణంలో గులాబీ జెండాను ఎగురవేయాలని సూచించారు. తర్వాత అన్ని గ్రామాల నాయకులు, ప్రజలు మండలకేంద్రానికి చేరుకుని ఒక పండుగ వాతావరణంలో పటాకులు కాల్చి జెండావిష్కరణలో పాల్గొనాలని వివరించారు. ఈ నెల 3 నుంచి 12వ తేదీ వరకు గ్రామ కమిటీల నియామకం ఉంటుందని వెల్లడించారు. 8 రోజుల్లోగా మండలం మొత్తం, పట్టణంలో కమిటీల నియామకం చేయాలన్నారు.
జెండా పండుగను జయప్రదం చేయాలి
టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 2న టీఆర్ఎస్ జెండా పండుగను మండలవ్యాప్తంగా జయప్రదం చేయాలని పార్టీ మండలాధ్యక్షుడు బాల్నె వెంకన్నగౌడ్ పిలుపునిచ్చారు. మండలకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మండలంలోని 30 గ్రామ పంచాయతీల్లో గులాబీ జెండాలను ఆవిష్కరించాలని కోరారు. సమావేశంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కుండె మల్లయ్య, మాజీ జడ్పీటీసీ జున్నూతుల రాంరెడ్డి, తెలంగాణ జాగృతి మండలాధ్యక్షుడు మూడు రమేశ్, వార్డు సభ్యుడు జున్నూతుల శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు. టీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణమే ధ్యేయంగా గురువారం పార్టీ ఆధ్వర్యంలో జెండా పండుగ నిర్వహించనున్నట్లు టీఆర్ఎస్ నల్లబెల్లి మండల అధ్యక్షుడు బానోత్ సారంగపాణి తెలిపారు. 2న మండలంలోని అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ శ్రేణులు జెండా పండుగను వైభవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
సెప్టెంబర్ 2న టీఆర్ఎస్ జెండా పండుగను విజయవంతం చేయాలని విలీన గ్రామాల టీఆర్ఎస్ అధ్యక్షుడు చింతం సదానందం కోరారు. గ్రామాల్లో గులాబీ జెండాలను ఎగురవేయాలని సూచించారు. 3వ తేదీ నుంచి గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి గ్రామ కమిటీ ఏర్పాటు చేసుకోవాలన్నారు. 3న ధర్మారం, జాన్‌పాక, 4న గరీభ్‌నగర్, కీర్తినగర్ కాలనీ, 5న మొగిలిచర్ల, రెడ్డిపాలెం, 6న గొర్రెకుంట, పోతురాజుపల్లిలో కమిటీల నియామకం ఉంటుందని వివరించారు. నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని కోరారు.
ఖానాపురం: సెప్టెంబర్ 2న టీఆర్ఎస్ జెండా పండుగను విజయవంతం చేయాలని ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మి వెంకటనర్సయ్య కోరారు. వారి వెంట ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్ కోరారు.