వర్ధన్నపేట, అక్టోబర్ 11: ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ వెస్ట్‌జోన్ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. వర్ధన్నపేట మున్సిపల్ పట్టణ పరిధిలోని డీసీతండాలో వెస్ట్‌జోన్ పరిధిలోని 60 మంది జవాన్లు, ఎస్సైలు, సీఐలతో సోమవారం సాయంత్రం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా తండాలోని అన్ని వీధుల్లో సిబ్బంది తనిఖీలు నిర్వహించి నంబర్ ప్లేట్లు లేని 30 ద్విచక్ర వాహనాలు, ఐదు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తండాలోని పాఠశాల ఆవరణలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ గంజాయి, గుట్కా లాంటి నిషేధిత వస్తువులు వాడినా, విక్రయించినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సారా తయారీ, అక్రమంగా రేషన్ బియ్యాన్ని సేకరించి విక్రయించడం, బ్లాక్ మార్కెట్లో గ్యాస్ సిలిండర్లు, కిరోసిన్ అమ్మడం, నకిలీ ఆహార వస్తువులు పేదలకు విక్రయించడం వంటి వాటికి ఎవరైనా పాల్పడితే సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని స్థానికులకు సూచించారు. అంతేకాకుండా వాహనాల అపహరణ, నంబర్లు లేని వాహనాలు ఉంటే సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. దొంగతనాలకు పాల్పడిన వారు, రౌడీషీటర్లు, శాంతిభద్రతలకు విఘా తం కలిగించే వ్యక్తులపై నిఘా ఉంటుందన్నారు. కార్యక్రమంలో వర్ధన్నపేట ఏసీపీ గొల్ల రమేశ్, సీఐలు సదన్‌కుమార్, చేరాలు, ఎస్సైలు రామారావు, రాజు, వంశీకృష్ణ, పవన్‌కుమార్, సివిల్, ఏఆర్ జవాన్లు, హోంగార్డులు పాల్గొన్నారు.
పోలీస్‌స్టేషన్ ఆకస్మిక తనిఖీ
రాయపర్తి: మండలకేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను సోమవారం రాత్రి వెస్ట్‌జోన్ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి వర్ధన్నపేట ఏసీపీ గొల్ల రమేశ్‌తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ ఆవరణ, ఎస్సై, ఏఎస్సై చాంబర్లు, ఆయుధాల గది, లాకప్‌లు, సన్నిహిత కౌంటర్లతోపాటు నూతన నిర్మాణాలు, అదనపు గదులు, హాల్, ఆవరణలో మొక్కలు నాటించిన విధానాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కేవలం రెండు నెలల వ్యవధిలోనే దాతల సహకారంతో స్టేషన్‌ను ఆహ్లాదకర వాతావరణంలోకి తీసుకొచ్చిన ఎస్సై బండారి రాజు, సిబ్బందిని ఈ సందర్భంగా డీసీపీ అభినందించారు. కార్యక్రమంలో ఏఎస్సై సదయ్య, సిబ్బంది గరికపాటి సురేశ్రావు, తూళ్ల సంపత్, బొట్ల రాజు, లక్ష్మణ్, మమత, మహేందర్ పాల్గొన్నారు.