శనివారం 31 అక్టోబర్ 2020
Warangal-city - Sep 15, 2020 , 08:03:43

‘బెస్ట్‌ అవైలబుల్‌' కు దరఖాస్తుల ఆహ్వానం

‘బెస్ట్‌ అవైలబుల్‌' కు దరఖాస్తుల ఆహ్వానం

హన్మకొండ : జిల్లాలో 2020-21 విద్యా సంవత్సరానికి ‘బెస్ట్‌ అవైలబుల్‌' కింద 1, 5వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి బీ నిర్మల తెలిపారు. 1వ తరగతిలో 32, 5వ తరగతిలో 31 సీట్లు కేటాయించినట్లు చెప్పారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు సంబంధిత సహాయ సాంఘిక సంక్షేమాధికారి (ఏఎస్‌డబ్ల్యూవో) నుంచి దరఖాస్తులు పొందాలన్నారు. సంబంధిత ధ్రువపత్రాలు జతచేసి వచ్చే నెల 10లోగా ఏఎస్‌డబ్ల్యూవోలో  సాయంత్రం 4 గంటల్లోగా అందజేయాలన్నారు. 

దరఖాస్తులు లభించే కార్యాలయాలు

ఖిలావరంగల్‌, హన్మకొండ, కాజీపేట, ధర్మసాగర్‌, వేలేరు, ఐనవోలు మండలాల విద్యార్థులు హన్మకొండ అంబేద్కర్‌ భవన్‌లో ఉన్న సహాయ షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి కార్యాలయంలో (ఫోన్‌ నంబర్‌ 9866252443) సంప్రదించాలన్నారు. హసన్‌పర్తి, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపుర్‌, వరంగల్‌ మండలాల వారు హసన్‌పర్తిలోని సహాయ షెడ్యూల్డ్‌ కులాల అధికారి కార్యాలయంలో (ఫోన్‌ నంబర్‌ 9849285023) సంప్రదించాలని ఆమె పేర్కొన్నారు.