ఆదివారం 12 జూలై 2020
Warangal-city - Jun 01, 2020 , 04:16:39

ఆస్తి పన్ను వసూళ్లు రూ.20.06 కోట్లు

ఆస్తి పన్ను వసూళ్లు రూ.20.06 కోట్లు

  • రాష్ట్రంలో మొదటి స్థానంలో గేటర్‌ వరంగల్‌
  • 5 శాతం రాయితీని సద్వినియోగం చేసుకున్న నగరవాసులు
  • చివరి రోజు రూ.1.16 కోట్లు వసూలు
  • గతేడాది సైతం రూ.12 కోట్లతో నంబర్‌ వన్‌

వరంగల్‌, మే 31: 2020-21 ఆర్థిక సంవత్సరానికి ముందస్తు ఆస్తి పన్ను వసూళ్లలో గ్రేటర్‌ వరంగల్‌ రికార్డు సృష్టించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాయితీని ప్రజల్లోకి తీసుకుపోయి రూ.20 కోట్లు పన్ను వసూలు చేసి గత రికార్డును తిరగరాసింది. గత ఏడాది 2019-20 ముం దస్తు ఆస్తి పన్ను వసూళ్లలో రూ.12 కోట్లు వ సూళ్లు చేసి రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది సైతం తన రికార్డును బ్రేక్‌ చేసి గ్రేటర్‌ వరంగల్‌ రూ.20.06 కోట్లు వసూలు చేసి రెండోసారి రా ష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ నేపథ్యంలో గ్రేటర్‌ పన్నుల విభాగం అధికారులు, సిబ్బంది కష్టపడి ముందస్తు పన్నులు వసూలు చేయడంపై కమిషనర్‌ పమేలా సత్పతి అభినందనలు తెలిపారు. మే 31 వరకు ముందస్తు ఆస్తి పన్ను చెల్లింపులపై రాష్ట్ర ప్రభుత్వం 5 శాతం రాయితీని ప్రకటించడంతో పన్ను ల విభాగం సిబ్బంది రాత్రి వరకు వసూళ్లలో నిమగ్నమయ్యారు. 

పన్నులు చెల్లించిన ప్రజాప్రతినిధులు

 మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు గ్రేటర్‌ పరిధిలోని ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు తమ ఆస్తి పన్నును ముందస్తుగా చెల్లించి ప్రభ్వుత్వం ప్రకటించిన 5శాతం రాయితీ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ఒకరిద్దరు కార్పొరేటర్లు మినహా మిగతా వారంతా ముందస్తు ఆస్తి పన్ను చెల్లించారు. ఆదివారం స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య తమ ఆస్తి పన్ను రూ. 68,427లను ముందస్తుగా చెల్లించారు. 5 శాతం రాయితీ గడువు చివరి రోజు రూ. కోటి 16 లక్షలు వసూ లు కావడం విశేషం.logo