శుక్రవారం 05 జూన్ 2020
Wanaparthy - May 06, 2020 , 02:17:13

లాక్‌డౌన్‌ మరిచారు.. ప్లకార్డులు పట్టారు..

లాక్‌డౌన్‌ మరిచారు.. ప్లకార్డులు పట్టారు..

లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించిన వారితో పోలీసులు ఫ్లకార్డులను ప్రదర్శింపజేశారు. మంగళవారం వనపర్తిలోని రాజీవ్‌ చౌరస్తాలో నిబంధనలు ఉల్లంఘించిన వారి వాహనాలను డీఎస్పీ కిరణ్‌కుమార్‌ నిలిపి రోడ్డుపై కరోనా ఫ్లకార్డులను పట్టించి నినాదాలు చేయించారు. వాహనాలను సాయంత్రం వరకు అక్కడే ఉంచి చలానాలు వేశారు. మరోసారి నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐ సూర్యానాయక్‌, ఎస్సై వెంకటేశ్‌గౌడ్‌ పాల్గొన్నారు. 

- వనపర్తి టౌన్‌ 


logo