డ్రగ్ ట్రాఫికింగ్.. అధ్యక్షుడి సోదరుడికి జీవితఖైదు శిక్ష

న్యూయార్క్: హోండురస్ అధ్యక్షుడు జువాన్ ఓర్లాండో హెర్నాండేజ్ సోదరుడు టోనీ హెర్నాండేజ్కు అమెరికా కోర్టు జీవితకాల శిక్షను విధించింది. అక్రమంగా డ్రగ్స్ రవాణా చేసిన కేసులో న్యూయార్క్ జడ్జి ఈ తీర్పును వెలువరించారు. సెంట్రల్ అమెరికా దేశమైన హూండురస్లో 42 ఏళ్ల టోనీ హెర్నాండేజ్ మాజీ పార్లమెంటేరియన్‌గా చేశారు. 2019లో అమెరికా కోర్టు అతనిపై నాలుగు అభియోగాలు నమోదు చేసింది. అక్రమ రీతిలో కొకైన్‌ను అమెరికాకు చేరవేయడం, మెషీన్గన్లు కలిగి ఉన్న కేసుల్లో ఆయన్ను అరెస్టు చేశారు. జడ్జి పీ కెవిన్ క్యాసిల్ తీర్పును వెలువరిస్తూ.. అమెరికాకు టోనీ హెర్నాండేజ్ 185 టన్ను కొకైన్ మాదకద్రవ్యాలను సరఫరా చేశారని, టీహెచ్ బ్రాండ్‌తో ఉన్న ఆ డ్రగ్స్‌కు అమెరికాలో మార్కెటింగ్ జరుగుతోందన్నారు. తన సోదరుడు టోనీకి జీవితఖైదు శిక్షను విధించడాన్ని హోండురస్ అధ్యక్షుడు ఓర్లాండో హెర్నాండేజ్ తప్పుపట్టారు. అమెరికా కోర్టు తీర్పు దారుణమన్నారు. తప్పుడు సాక్ష్యాలతో తన సోదరుడికి శిక్ష విధించినట్లు ఆయన ఆరోపించారు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న కొకైన్ మాదక ద్రవ్యాల సరఫరాల్లో టోనీ కీలక సభ్యుడని, ఆయన పట్ల ఎటువంటి కనికరం చూపవద్దు అని ప్రాసిక్యూటర్లు వాదించారు. 2014 నుంచి 2018 వరకు హూండురస్ పార్లమెంట్లో సభ్యుడిగా ఉన్నారు. 2018 నవంబర్‌లో అయన్ను మియామిలో అరెస్టు చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

