తెలంగాణలో కొత్తగా 684 కరోనా కేసులు
కరోనా | రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత పెరుగుతున్నది. గడిచిన 24 గంటల్లో 684 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ బుధవారం హెల్త్

హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత పెరుగుతున్నది. గడిచిన 24 గంటల్లో 684 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ బుధవారం హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. వైరస్ ప్రభావంతో మరో ముగ్గురు మృత్యువాతపడ్డారు. కొత్తగా వైరస్ నుంచి 394 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,665 యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం 1,873 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.
కొత్తగా రికార్డయిన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే 184 ఉన్నాయి. మంగళవారం రాష్ట్రంలో 56,122 టెస్టులు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ వివరించింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,07,889కు చేరగా.. 3,01,227 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,697కు పెరిగింది. పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా అందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించాలని వైద్య, ఆరోగ్యశాఖ సూచించింది.
ఇవి కూడా చదవండి..
నేడు భారత్‌కు మరో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు
రాష్ట్రంలో మూడు రోజులు వడగాలులు
ఆస్తిపన్ను చెల్లింపునకు నేటితో ముగియనున్న గడువు
నిత్యం 45వేల మందికే శ్రీవారి దర్శనం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

