ఆదివారం 29 మార్చి 2020
Wanaparthy - Feb 12, 2020 , 23:47:13

యూరియా వాడకం తగ్గించాలి : ఏవో

యూరియా వాడకం తగ్గించాలి : ఏవో

వనపర్తి రూరల్‌ : మండలంలోని పెద్దగూడెం గ్రామంలోని వరిపంట పొలాలను బుధవారం మండల వ్యవసాయశాఖ అధికారి కురుమయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రబీ సీజన్‌లో సాగు చేస్తున్న వరికి  ఎక్కువగా ఆకు కోనలు ఎరుపు,  పసుపు రంగుల్లో మారడం, సూక్ష్మ పోషకాల లోపాన్ని గమనించడం జరిగిందన్నారు. దీని నివారణకు రైతులు జింక్‌ను 2 గ్రాములు, పార్ములా(4)ను 5 గ్రాములు లీటరు నీటికి కలిపి 8 రోజులకోసారి 2 సార్లు పిచికారి చేయాలని రైతులకు సూచించారు.  అలాగే వరి పంటలో అగ్గితెగులు కూడా గమనించడం జరిగిందని, నివారణకు ఐసోప్రోయోలిన్‌ మందును 2 గ్రాములు లేదా కాసుగామైసిన్‌ను 2.5 గ్రాములను లీటర్‌ నీటికి కలిపి పిచికారి చేయాలని యూరియా వాడకాన్ని తగ్గించాలన్నారు. కాండం తొలిచే పురుగు గమనిస్తే క్లోరాంద్రనిప్రోల్‌ లేదా గుళికలు 4 కీలోలు వేసుకోవాలని రైతులకు పలు సూచనలు, జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, రైతులు ఉన్నారు. 

తెగుళ్ల నివారణకు చర్యలు

గోపాల్‌పేట :  ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా  వరి పంటకు అధిక యూరియా వాడకం తగ్గించాలని ఏవో నరేశ్‌ రైతులకు సూచించారు. బుధవారం ఆయన మండలంలోని ఏదుట్లతో రైతులు యాసంగి సాగు చేసిన వరి పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరికి అధిక యూరియా వాడకం వల్ల అగ్గి తెగులు, ఆకుముడత పురు గు, కాండంతొలుచు పురుగు ఆశించే అవకాశం ఉందన్నారు. నివారణకు 2 గ్రా. కార్టోపైక్లోరైడ్‌  లేదా 0.3 మి.లీ. క్లోరాంట్నిల్లిప్రోల్‌ను లీటరు నీటిని కలిపి పిచికారి చేయాలన్నారు. వరి పంటలో అగ్గితెగులు గమనించడం జరిగిందన్నారు. నివారణకు ఎకరాలకు 500 మి.లీ. కసుగామైసిన్‌ లేక 500 మి.లీ. యశోప్రతియోలిన పిచికారి చేయాలన్నారు. పొలంలో జింక్‌లోపం నివారణకు 2 గ్రా. జింక్‌ సల్ఫేట్‌ లీటరు నీటితో పిచికారి చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఈవో పవన్‌కల్యాణ్‌, రైతులు ధర్మయ్య, రాములు, రేణుక, ఆంజనేయులు, వెంకటయ్య ఉన్నారు.


logo