పరిగి, ఏప్రిల్ 19 : కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో భాగంగా సోమవారం పరిగి పట్టణంలోని వెంకటేశ్వరకాలనీలో మున్సిపల్ ఆధ్వర్యంలో హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేయించినట్లు వార్డు కౌన్సిలర్ వారాల రవీంద్ర తెలిపారు. ప్రజలు సైతం తగిన జాగ్రత్తలు పాటించాలని, అత్యవసర పని ఉంటే తప్ప బయటకు రావద్దని సూచించారు.
గౌతాపూర్‌లో ముగ్గురికి పాజిటివ్
తాండూరు రూరల్, ఏప్రిల్ 19 : గౌతాపూర్‌లో సోమవారం 53 మందికి పరీక్షలు నిర్వహించగా, అందులో ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. ఇందులో కరణ్‌కోట గ్రామానికి చెందిన ఇద్దరు, గౌతాపూర్‌కు చెందిన వారు ఒకరు ఉన్నారు.
పరిగి మండలంలో 58 మందికి..
పరిగి, ఏప్రిల్ 19 : పరిగి క్లస్టర్ హెల్త్ సెంటర్, చిట్యాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం 356 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 58 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని చిట్యాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి గౌసొద్దీన్ అన్నారు. పరిగిలో 10 మందికి, బర్కత్‌పల్లి, మల్కాయ్పేట్తండాలలో ముగ్గురు చొప్పున, కిష్టమ్మగుళ్లతండా, రాపోల్లో ఇద్దరు చొప్పున, లక్ష్మీదేవిపల్లి, మల్లెమోనిగూడ, సయ్యద్‌మల్కాపూర్, న్యామత్‌నగర్, ఇబ్రహీంపూర్, లఖ్నాపూర్, తొండపల్లి, నర్సయ్యగూడలలో ఒక్కొక్కరికి, గడిసింగాపూర్లో 30 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆయన పేర్కొన్నారు.
దోమ మండలంలో 12..
దోమ, ఏప్రిల్ 19 : దోమ మండల పరిధిలో 12 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వ దవాఖాన సూపర్వైజర్ పీతాంబరంగౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం దోమ మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన 58 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 12 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఆయన తెలిపారు.
కులకచర్లలో 45..
కులకచర్ల మండలంలో 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వ వైద్యాధికారి మురళీకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన వ్యక్తులకు ప్రభుత్వ దవాఖానలో కరోనా ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు నిర్వహించగా 45 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఆయన తెలిపారు.
కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలి
దోమ, ఏప్రిల్ 19 : కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని గిరిజన విద్యార్థి సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రాథోడ్ శ్రీనివాస్‌నాయక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కరోనా నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులతోపాటు శానిటైజర్, మాస్కులు పంపిణీ చేయాలని కోరారు.
ఇవీ కూడా చదవండి…
పిల్లల్లో క్యాన్సర్స్ రకాలు- కారణాలు- లక్షణాలు
ప్రతి తండాకు బీటీ రోడ్డు, పంచాయతీ భవనం నిర్మిస్తాం