గొర్రెలు.. డబుల్

- గొల్ల, కురుమలకు పెరిగిన సంపద
- రూ.65.60 కోట్లు సంపద సృష్టి
- వికారాబాద్ జిల్లాలో 10,477
- యూనిట్ల గొర్రెల పంపిణీ
- 82 వేల గొర్రె పిల్లల జననం
- మెరుగుపడిన గొల్ల,
- కురుమల ఆర్థిక స్థితి
పరిగి, జనవరి 18 : గొల్ల, కురుమల ఆర్థికాభివృద్ధికి తెలంగాణ సర్కార్ మొదటి విడుతలో సబ్సిడీపై గొర్రెలను అందించింది. ప్రస్తుతం గొర్ల మందలు డబుల్ కావడంతో గొల్ల, కురుమలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో తొలి విడుత గొర్రెలకు జన్మించిన గొర్రె పిల్లలతో సుమారు రూ.57.40 కోట్లు విలువ చేసే సంపద పెరిగింది. త్వరలో రెండో విడుత గొర్రెల పంపిణీతో జిల్లావ్యాప్తంగా మరో 11వేల కుటుంబాలకు మేలు కలుగనున్నది. గొర్రెల పంపిణీ పథకం విజయవంతంగా అమలవుతుండడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తొలి విడుతలో 2,20,017 గొర్రెలు పంపిణీ..
వికారాబాద్ జిల్లావ్యాప్తంగా తొలి విడుతలో 10,954 యూనిట్ల గొర్రెల పంపిణీ చేసేందుకు నిర్ణయించారు. ఇందులో సబ్సిడీపోను 25 శాతం అంటే రూ.31,125 చెల్లించిన 10,477 మందికీ గొర్రె పిల్లలను అందజేశారు. ఒక యూనిట్ గొర్రె పిల్లల ధర మొత్తం రూ.1,25,000. ఇందులో లబ్ధిదారుడు రూ.31,250 చెల్లించగా, ప్రభుత్వం రూ.93,750 అందజేసింది. వాటిలో గొర్రె పిల్లల రవాణా, వాటికి దాణా, బీమా సదుపాయం, మందుల ఖర్చులు మినహా, రూ.1,11,000లతో ఒక యూనిట్‌గా 20 గొర్రె పిల్లలు, ఒక గొర్రె పొట్టేలును అందజేశారు.
రూ.65.60కోట్ల విలువ చేసే గొర్రెల సంపద సృష్టి
వికారాబాద్ జిల్లావ్యాప్తంగా 10,477 యూనిట్ల గొర్రెలను అధికారులు లబ్ధిదారులకు పంపిణీ చేయగా, సుమారు 82వేల పైచిలుకు గొర్రె పిల్లలు జన్మించాయి. ప్రస్తుతం ఈ గొర్రె పిల్లలు పెరిగి పెద్దవయ్యాయి. ఒక్కో గొర్రెకు సుమారు రూ.8వేలు, గొర్రె పొట్టేలుకు సుమారు రూ.10వేల వరకు ధర పలుకుతున్నది. ఈ లెక్కన ఒకదానికి రూ.8వేల ధర పలికినా, 82వేల గొర్రెలకు సుమారు రూ.65.60కోట్లు అవుతుంది. సంపద పెరుగడంతో గొల్ల, కురుమల జీవితాల్లో వెలుగులు నిండాయి.
సర్కారు తోడ్పాటుతో వృద్ధి..
సర్కారు ఇచ్చిన గొర్రెలతో మరింత అభివృద్ధిని సాధించాం. గొర్రెలు పెరుగడంతో సంపద పెరిగింది. ఆర్థికంగా ఎదిగేందుకు అండగా నిలిచిన తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
- ప్యాట బాల్‌రాజ్, ఐనాపూర్, దోమ మండలం
గొర్రె పిల్లలతో ఆర్థిక ఎదుగుదల..
గొర్రె పిల్లల పెంపకంతో ఆర్థికంగా ఎదిగాం. ప్రభుత్వం సబ్సిడీపై 20 గొర్రెలు, ఒక పొట్టేలు అందజేసింది. వాటికి సుమారు 30 పైగానే పిల్లలు పుట్టాయి. దీంతో రూ.80 వేల ఆదాయం వచ్చింది.
- ఎల్లయ్యోల్ల మల్లేశ్ మిట్టకోడూర్, పరిగి మండలం
సంపద సృష్టి జరిగింది...
జిల్లాలో తొలి విడుతలో 10,477 యూనిట్ల గొర్రె పిల్లలను పంపిణీ చేయడం జరిగింది. వాటికి సుమారు 82వేల పిల్లలు పుట్టాయి. సలహాలు ఇవ్వడంతోపాటు గొర్రెలకు వ్యాక్సినేషన్, డీ వార్మింగ్ కొనసాగిస్తున్నాం.
- వసంతకుమారి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి
తాజావార్తలు
- ఆంక్షలతో విసిగి : ఇండ్ల నుంచి పారిపోయిన నలుగురు బాలికలు!
- కూతురితో కమెడియన్ సత్య డ్యాన్స్..వీడియో
- నీరవ్ మోదీ కేసులో యూకే జడ్జి కీలక తీర్పు
- వికెట్లు టపటపా..భారత్ 145 ఆలౌట్
- పారిశుద్ధ్యాన్ని పక్కాగా చేపట్టాలి : డా. యోగితా రాణా
- నియంత్రణ సంస్థ పరిధిలోకి డిజిటల్ న్యూస్!
- రాజ్‌నాథ్‌సింగ్ పంజరంలో పక్షి : రైతు నేత నరేశ్ తికాయత్
- మహేశ్‌బాబుకు పెద్ద చిక్కే వచ్చింది..అదేంటో తెలుసా..?
- భార్య టీ చేయకపోవడం.. భర్తను రెచ్చగొట్టి దాడికి ప్రేరేపించడం కాదు..
- చేనేతకు చేయూతనిద్దాం : మంత్రి నిరంజన్ రెడ్డి