సోమవారం 01 మార్చి 2021
Vikarabad - Jan 17, 2021 , 00:05:38

కేసుల విషయంలో నిర్లక్ష్యం వద్దు

కేసుల విషయంలో నిర్లక్ష్యం వద్దు

  • వికారాబాద్‌ జిల్లా ఎస్పీ ఎం. నారాయణ వెల్లడి 
  • కేసులను త్వరగా పూర్తి చేసి చార్జ్‌షీట్‌ తెరువాలి
  • సమీక్షా సమావేశంలో వికారాబాద్‌ జిల్లా ఎస్పీ నారాయణ  

వికారాబాద్‌, జనవరి 16, (నమస్తే తెలంగాణ) : కేసుల విషయంలో నిర్లక్ష్యం వహించకుండా (అండర్‌ ఇన్వెస్టిగేషన్‌) కేసులను త్వరగా పూర్తి చేసి చార్జ్‌షీట్‌ వేయాలని వికారాబాద్‌ జిల్లా ఎస్పీ ఎం. నారాయణ ఆదేశించారు. అధికారులు తమ దగ్గర ఉన్న పెండింగ్‌ కేసులను పూర్తి చేసేలా దృష్టి పెట్టాలన్నారు. శనివారం తాండూరు, వికారాబాద్‌ సబ్‌ డివిజన్లతో పాటు పరిగి, కొడంగల్‌ సర్కిల్‌ పోలీస్‌ అధికారులతో నెలవారీ నేర సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నారాయణ మాట్లాడుతూ.. వర్టికల్‌ పోలీస్‌ అధికారులకు శిక్షణ ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలన్నారు. కేసుల విషయంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైనా, ఏదైనా విషయంపై అవగాహన లేకపోయినా ఉన్నతాధికారులకు తెలుపాలన్నారు. పోలీస్‌స్టేషన్లలో ఉన్న కోర్టు ప్రాపర్టీలను కానిస్టేబుళ్ల ద్వారా కోర్టుల్లో అప్పగించాలన్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో సోషల్‌ మీడియా టీమ్‌లను ఏర్పాటు చేసి అధికారులు చురుగ్గా పనిచేయాలని సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఎంఏ రషీద్‌, వికారాబాద్‌ డీఎస్పీ సంజీవరావు, పరిగి డీఎస్పీ శ్రీనివాస్‌, తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ, జిల్లాలోని సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

VIDEOS

logo