శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Vikarabad - Jun 19, 2020 , 01:15:43

రూ.100 కోట్లతో తాండూరు అభివృద్ధి

రూ.100 కోట్లతో తాండూరు అభివృద్ధి

n నిలిచిన పనులను త్వరలో  పూర్తి చేస్తాం

n ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి

   తాండూరు: నియోజక వర్గ అభివృద్ధికి నిరంతరంగా పాటుపడుతానని  ఎమ్మెల్సీ పి.మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సహకారంతో రూ.100 కోట్లతో తాండూరులో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. త్వరలో వాటిని పూర్తి చేయాలని మంత్రి కేటీఆర్‌ ఇటీవల నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, బషీరాబాద్‌, పెద్దేముల్‌ మండలాల పరిధిలో అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి కార్యక్రమాలను త్వరలో పూర్తి చేస్తామన్నారు. తాండూరులో రోడ్డు విస్తీర్ణంతో పాటు రైల్వే బ్రిడ్జి నిర్మాణం, ఔటర్‌రింగ్‌ రోడ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. భూమి కోల్పోయిన రైతుల ఖాతాల్లో డబ్బులు వేసినట్లు తెలిపారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు స్థానిక నేతలతో కలిసి పనులన్ని దగ్గరుండి చేపిస్తానన్నారు. రైతులకు తెలంగాణ సర్కార్‌ అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తుందని, పండించిన ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేయడంతో పాటు పంట పెట్టుబడి సాయం అందిస్తున్నదని గుర్తు చేశారు.  తాండూరులో నిర్మించిన మున్సిపల్‌ నూతన భవనాన్ని మంత్రి కేటీఆర్‌ చేతులమీదుగా త్వరలో ప్రారంభిస్తామన్నారు. పార్కుల అభివృద్ధికి కేటాయించిన నిధులతో వెంటనే బాగు చేసి ప్రజలు ఆహ్లాదంగా గడిపేందుకు త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. పార్టీలకతీతంగా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పాలన బాగుందన్నారు. కార్యక్రమంలో తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్నపరిమళ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వడ్డె శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు రవిగౌడ్‌, సాయిలుగౌడ్‌, రాజుగౌడ్‌, బాల్‌రెడ్డి, రాము తదితరులున్నారు.


logo