మంగళవారం 11 ఆగస్టు 2020
Vikarabad - Mar 02, 2020 , 23:41:11

‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించాలి

‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
  • విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
  • బంట్వారం కస్తూర్బా గురుకుల, మంబాపూర్‌ ఉన్నత పాఠశాలలను తనిఖీ చేసిన డీఈవో రేణుకాదేవి
  • ప్రీ ఫైనల్‌ పరీక్షలు నిర్వహించి.. సమాధాన పత్రాలు ఇవ్వకపోవడంపై మంబాపూర్‌ ఉపాధ్యాయులపై ఆగ్రహం

బంట్వారం : పదో తరగతి విద్యార్థులు అద్భుతమై న ఫలితాలు సాధించాలని డీఈవో రేణుకాదేవి సూ చించారు. సోమవారం ఆమె మండల కేంద్రంలోని కస్తూర్బా గురుకుల బాలికల పాఠశాలను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో ముచ్చటించారు. గతేడాదిలా కాకుండా ఈసారి పది లో వందశాతం ఉతీర్ణత సాధించి, పాఠశాలకు, ఉపాధ్యాయులకు పేరు తేవాలన్నారు. ప్రతి సబ్జెక్ట్‌లో విద్యార్థులు 90శాతం పైగా పాస్‌ అయ్యేలా వారిని తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతి రోజు సబ్జెక్టుల వారీగా విద్యార్థులకు ప్రశ్నలు, సమాధానాలతో విద్యా బోధన చేయాలని తెలిపారు. వార్షిక పరీక్షలను ఎలా ఎదుర్కోవాలనే దానిపై అనుమానాలను నివృత్తి చేయలన్నారు.


నాసిరకం కూరగాయలు సరఫరా చేస్తే చర్యలు 

పాఠశాలకు నాసిరకం కూరగాయలు సరఫరా చేస్తే, సంబంధిత కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. వంట గదిని పరిశీలించగా నాసిరకంగా ఉన్న కూరగాయలు చూసి అవసరమైతే సదరు కాంట్రాక్టరును తొలగించాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాల్సిన బాధ్యత మనందరిదని చెప్పారు. వంట వండేటప్పుడు పరిశుభ్రత పాటించాలన్నా రు. పాఠశాల అవసరాలు ఏమైనా ఉంటే ఎప్పటికప్పుడు నివేదికలో తెలియజేయాలన్నా రు. ఆమె వెంట ఎంఈవో చంద్రప్ప, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ శైలజ, ఇతర ఉపాధ్యాయులు ఉన్నారు.


ఉపాధ్యాయులపైన డీఈవో ఆగ్రహం

పెద్దేముల్‌ : ఫ్రీ ఫైనల్‌ పరీక్షలు నిర్వహించి సమాధాన పత్రాలు విద్యార్థులకు ఇవ్వనందుకు మంబాపూ ర్‌ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులపై డీఈవో రేణుకాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. 10వ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులు కార్యక్రమం లో భాగంగా సోమవారం మండల పరిధిలోని మంబాపూర్‌ ఉన్నత పాఠశాలను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ త్వరలో జరుగబోయే 10వ తరగతి పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా సుమారు 13,768మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారని, అందుకు సంబంధించి అన్ని ఉన్నత పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయని అన్నారు. విద్యార్థులను తరగతిలో ప్రశ్నిస్తూ మీకు ఫ్రీ ఫైనల్‌ పరీక్షలు నిర్వహించారా? అందులో ఏం ప్రశ్నలు వచ్చాయి? అని అడుగగా అందుకు విద్యార్థులు సమాధానం చెపుతూ పరీక్షలు నిర్వహించారు కానీ సమాధాన పత్రాలు తమకు ఇవ్వలేదని తెలుపడంతో ఉపాధ్యాయులపైన ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో గణిత సమస్యలను చేయించారు. తదుపరి వంటగదిని పరిశీలించి అక్కడ పరిసరాలు భాగ లేకపోవడంతో ఒక్కొక్క విద్యార్థికి ఎన్ని గ్రాముల అన్నం, పప్పును ఇస్తున్నారని ఉపాధ్యాయులని అడుగగా అందుకు ఉపాధ్యాయులు తడపడడంతో విధుల్లో తమ పద్దతులను మార్చుకోవాలని, మార్చుకోక పోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆమె వెంట అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు.


ఇద్దరు ఉపాధ్యాయుల వేతనం కట్‌

మండల పరిధిలోని పాషాపూర్‌ ప్రాథమిక పాఠశాలలో ఫిబ్రవరి 29వ తేదీన ఇద్దరు ఉపాధ్యాయులు ఒకరు ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, ఒకరు విద్యావలంటీరు మధ్యాహ్నం 2.30గంటలకే పాఠశాలను వదిలివెళ్లడం జరిగింది. పక్కా సమాచారంతో సోమవారం పాషాపూర్‌ ప్రాథమిక పాఠశాలను డీఈవో సం దర్శించగా అక్కడ విధుల్లో ఉపాధ్యాయుల లేక పోవడంతో వారి నెల జీతాన్ని కట్‌ చేయాలని మండల విద్యాధికారి వెంకటయ్యను ఆదేశించారు.


logo