తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించాలన్న ఓ సామాన్యుడి కోరికను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు నెరవేర్చిన విషయం తెలిసిందే.. జనవరి 7న హైదరాబాద్‌లోని బోరబండలో గాజుల దుకాణం నడిపే ఇబ్రహీంఖాన్ ఇంటికి కేటీఆర్ వెళ్లి కుటుంబంతో కలిసి భోజనం చేశారు. ఈ నెల 2న నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కేటీఆర్‌కు ఇబ్రహీంఖాన్ ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు. ఈ పదేళ్ల కాలం రాత్రి, పగలు అనే తేడా లేకుండా తెలంగాణ ప్రజల కోసం పని చేశారు. దుదదృష్టవశాత్తు బీఆర్ఎస్ ఎన్నికల్లో గెలవలేదని, ఈ ఐదేండ్ల కాలం ఒక సినిమాలో ఇంటర్వెల్ మాదిరి గడిచిపోతుందనిఇబ్రహీం ట్వీట్ చేశారు. పదేండ్లు రాష్ర్టానికి సేవలు అందించినందుకు తన ఇంట్లో ఆతిథ్యం స్వీకరించాలని కేటీఆర్‌ను విజ్ఞప్తి చేశారు. ఇంటికి వస్తానని ఇబ్రహీంఖాన్ ఇచ్చిన మాట మేరకు.. జనవరి 7 ఆదివారం కేటీఆర్ వాళ్ల ఇంటికి వెళ్లి వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు. మరి అంత పెద్ద లీడర్ ఒక సామాన్యుడి కోరిక మేరకు ఇంటికి వెళ్లితే అతని రియాక్షన్ ఎలా ఉంది?.. కుటుంబ సభ్యుల రెస్పాన్స్ ఏంటి…వారి ఇంట్లో కేటీఆర్‌కు ఎలాంటి భోజనం వడ్డించారు వంటి విషయాలు స్వయంగా ఆ ఫ్యామిలీతోనే తెలుసుకునే ప్రయత్నం నమస్తే తెలంగాణ చేసింది. ఆ వీడియో మీకోసం
Also Read : సామాన్యుడి ఇంట్లో కేటీఆర్ లంచ్.. ఎక్స్‌లో ఆహ్వానంతో బోరబండకు