సీఎం కేసీఆర్ ఇటీవల ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 80,039 ఉద్యోగాలకు తక్షణం సంబంధిత శాఖల ద్వారా నోటిఫికేషన్లు ఇస్తున్నామని తెలిపారు. అయితే, ఇందులో మునుపెన్నడూ లేనివిధంగా 503 గ్రూప్ 1 పోస్టులున్నాయి. వీటికోసం ఎంతోమంది చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్నారు. అయితే, గ్రూప్ 1 కొట్టాలంటే ముందు సిలబస్‌లో ఏముందో తెలియాలి. కొత్తగా ప్రిపరేషన్ ప్రారంభించేవారికోసం సిలబస్‌ను క్షుణ్నంగా వివరించారు నల్లగొండ తహసీల్దార్ మందడి నాగార్జునరెడ్డి.