చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం వెనుకాల.. మన కూకట్పల్లిలోని నాగసాయి ప్రెసెసియస్ ఇంజినీర్స్ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీ పాత్ర కూడా కీలకంగా ఉంది. ఎందుకంటే.. చంద్రయాన్-3లో వినియోగించిన కొన్ని విడి పరికరాలను ఈ కంపెనీనే తయారు చేసి.. అందించింది ఇస్రోకు. ఈ సందర్భంగా కంపెనీ యజమాని బీఎన్ రెడ్డి ఆ విశేషాలను నమస్తే తెలంగాణతో ప్రత్యేకంగా పంచుకున్నారు..