e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home బతుకమ్మ వాస్తు

వాస్తు

వాస్తు

కాంపౌండ్‌ వాల్స్‌ రక్షణ కోసమని అంటారే. అపార్ట్‌మెంట్లలో పై అంతస్తులకు రక్షణ ఉండదా? కోమల, మోత్కూరు

‘ధ్వజస్థానం’ రక్షణలో ఉంటే దాని శిఖరం కూడా రక్షణలోనే ఉంటుంది. నేలమీద లేనిది ఆకాశంలో రాదు. నేలమీద ఉన్నది ఆకాశంలో పోదు. తల్లి వేరుకు నీరు పోస్తే చాలు. కొమ్మకొమ్మకు, రెమ్మరెమ్మకు పోయాల్సిన పన్లేదు. ‘ఇల్లు-స్థలం’ దిశల విభజనతో కుదిరినప్పుడు, దాని అంతస్తులు కూడా అదే విభజనలతో నిర్మించాలి. స్వల్ప మార్పులు ఉన్నా, మొత్తం స్ట్రక్చర్‌లో మార్పు ఉండదు. మార్పు చేసినా దానిమూలం దెబ్బతినదు. కాబట్టి, ఇంటికింది కాంపౌండ్స్‌ ఇచ్చే రక్షణ కేవలం నేలమీది పోర్షన్‌కే కాదు. దాని పైనున్న మేడలకు కూడా విస్తరిస్తుంది. మన నివాసం ఎత్తులో ఉన్నా, దానికి రాకపోకలు నేల మీది నుంచే కదా చేయాలి. అందువల్ల పై అంతస్తులకు దోషం ఉండదు.

నిజంగా పాజిటివ్‌, నెగెటివ్‌ శక్తులు ఉంటాయా? భయపెట్టడానికి అలా అంటారా? ఆనంద లక్ష్మి, సైదాపూర్‌

టీవీ, రేడియో తరంగాలు నిరంతరం మన చుట్టూ సంచరిస్తూ ఉంటాయి.సరిగ్గా ట్యూన్‌ చేసుకున్నప్పుడే పాట అయినా, దృశ్యం అయినా ఆనందించగలుగుతాం. ఇల్లు కూడా అంతే. ప్రకృతిలో నెగటివ్‌ ఎనర్జీ, పాజిటివ్‌ ఎనర్జీ ఉంటుంది. మన గృహం దానిని పరిచ్ఛిన్నం చేసి పాజిటివ్‌గా మార్చగలగాలి. ఎంత కాదనుకున్నా.. వద్దనుకున్నా మన పరిసరాల ప్రభావం మన ఇంటి మీద, మన మీద ఉంటుంది. రైల్వే ట్రాక్‌ దగ్గర ఉన్న ఇల్లు.. రైలు వెళ్తున్న ప్రతిసారీ కంపిస్తుంది. నిద్రలో ఉన్న పసిపిల్లాడు ఉలిక్కి పడతాడు. ఎప్పుడైతే ఆ పరిసరాలను వదిలి వస్తామో… అప్పుడే, ఆ అలజడి అంతమౌతుంది. ఇల్లు ప్రశాంతం అవుతుంది. మనిషికి మానసిక దృఢత్వం రావాలంటే మంచి పరిసరాల, మంచి గృహాల అవసరం తప్పనిసరి. మనలో ప్రతి ఒక్కరం మన పూర్వీకుల వారసత్వ లక్షణాలతో, పరిసరాల ప్రభావంతో ఉద్భవించిన వాళ్లమే అన్నది మరిచిపోవద్దు. ఆ విధంగా మనిషిలోని ఆలోచనలను పరిసరాలు ఎప్పుడూ ప్రభావితం చేస్తాయి. వాస్తవానికి మనసు కూడా ఒక శక్తే. అది సానుకులమైన ఆలోచనలు చేస్తే, అంటే పాజిటివ్‌గా ఆలోచిస్తే.. అర్థవంతమైన పనులు జరుగుతాయి. నెగెటివ్‌గా ఆలోచిస్తే అనర్థాలు, అనారోగ్యాలు వస్తాయి. అందుకే, ఇంటిని శాస్త్రీయంగా, సానుకూల వాతావరణంలో నిర్మించుకోవాలి. కాబట్టి, నిర్మాణం ఏదైనా దానికి నెగెటివ్‌, పాజిటివ్‌ శక్తులు ఏవో ఉంటాయన్న విషయాన్ని మరచిపోకూడదు.

విదిక్కులలో కొందరు ఇల్లు కట్టమంటారు. మరి కొందరు వద్దంటారు. ఏం చేయాలి? ఎస్‌.అమల, వేములవాడ

మనిషి బుద్ధినిబట్టి ఇల్లు. అందుకే, ‘ఇంటిని చూస్తే ఇల్లాలిని చూసినట్టు’ అంటారు. ఎవరెన్ని చెప్పినా కొందరు వినరు. కొందరు శాస్త్రం చెప్పినట్టు వింటారు. ఇంకొందరు యజమానులు వారికి అనుకూలంగా చెప్పినవాళ్ల మాటే వింటారు. నలుగురైదుగురి సలహాలు తీసుకుంటారు. ఇది ‘కలి’కాలం కదా! ఎవరు చెప్పినా వినకుండా సొంతంగా, ఇష్టంగా ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు ఇతరుల సలహాలు ఎందుకు? ‘జీవితం.. కర్మాను సారిణి’ అనేది ఇక్కడ బయటపడుతుంది. గత జీవిత వాసనలు ఎవరి మాట విననీయవు. వాసనలు అంటే ఆయా జన్మల సంస్కారాలు.అవి నిత్యం మనిషిని తొలుస్తూ ఉంటాయి. బుద్ధిని మేల్కొననీయవు. ‘ఇల్లు-జీవితం’ అనేది చాలా లోతైన విచారణ అంశం. ఎవరు ఎలా చెప్పినా శాస్త్ర హృదయం మానవ శ్రేయస్సును కోరి చెపుతుంది. అవన్నీ కాదు, అంతా మీ ఇష్టమే అనుకుంటే ఫలితాలు కూడా దాని ఇష్టంగానే ఉంటాయి. అనుభవించాలి.

మా పొలం వద్ద ఒక ఫామ్‌ హౌస్‌ కట్టాలనుకుంటున్నాం. రెడీమేడ్‌ ఇల్లు పెట్టుకోవచ్చా. కట్టుకుంటే మంచిదా? సుధీర్‌, మేడ్చల్‌

ఈ రోజుల్లో కొన్ని సంస్థలు రెడీమేడ్‌ ఇండ్లు తీసుకొచ్చి, అనుకున్న ప్రదేశంలో పెట్టేసి వెళ్తున్నాయి. ఒక చోట కట్టి ఓ చోట పెట్టేది నేడే కాదు.. మహాభారత కాలం నుంచీ ఉంది. ఎక్కడ కట్టినా దానికి వాడిన మెటీరియల్‌ ముఖ్యం. ఇనుప సందుక (ఇనుప పెట్టె)ను పెద్దగా చేస్తే ఇల్లు అవుతుండవచ్చు కానీ, అది నివాసానికి ఎంత వరకూ పనికొస్తుందనేది చూడాలి. ప్రకృతి విరుద్ధంగా తయారు చేసిన దానికి, పద్ధతి ప్రకారం కట్టిన దానికి ఎంతో తేడా ఉంటుంది. మనిషికి ఏదైనా స్పీడ్‌గా కావాలని అనిపిస్తుంది. కానీ రెగ్యులర్‌గా ఇటుక సిమెంట్‌తో కట్టిన ఇంటిలో ఎంతో జీవం ఉంటుంది. కంటైనర్‌ ఇండ్లు సైట్‌ ఆఫీసులుగా పనికొస్తాయి కానీ జీవ గృహాలకు, శాశ్వత గృహాలకు పనికి రావు. వ్యాపారాలకు దోషం లేదు.

సుద్దాల సుధాకర్‌ తేజ
[email protected]
Cell: 7993467678

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వాస్తు

ట్రెండింగ్‌

Advertisement