Vasthu Shastra | మేము ఇటీవలే ఒక ఇంట్లో చేరాం. అప్పటినుంచి ఏదో అర్థంకాని భయం వెంటాడుతున్నది. ఏం చేయాలి? ఏదైనా వాస్తు లోపం ఉందేమో అని అనుమానం.
నిజానికి మీ భయం ఇంటికి సంబంధించినది కాదు. మీ మనసులోనిది. మనిషి తన వ్యథకు కారణమైన దాన్ని చూసి భయపడతాడు. బాధపడతాడు. అది భౌతికమా? మానసికమా? ఊహనా? అనేది తెలుసుకోవాలి. ఒక స్థానం వదిలి మరొక స్థానం చేరడం వల్ల రేపు ఎలా ఉంటుందో అనే ఆందోళన కూడా మనల్ని బాధకు, భయానికి గురిచేస్తుంది.
– ఎం. సుభద్ర, కొమురవెల్లి
నిజానికి మీ భయం ఇంటికి సంబంధించినది కాదు. మీ మనసులోనిది. మనిషి తన వ్యథకు కారణమైన దాన్ని చూసి భయపడతాడు. బాధపడతాడు. అది భౌతికమా? మానసికమా? ఊహనా? అనేది తెలుసుకోవాలి. ఒక స్థానం వదిలి మరొక స్థానం చేరడం వల్ల రేపు ఎలా ఉంటుందో అనే ఆందోళన కూడా మనల్ని బాధకు, భయానికి గురిచేస్తుంది. అయితే, అది తాత్కాలికమే! మనం ఎప్పుడూ.. ‘రేపు ఏమవుతుందో!?’ అని కాకుండా.. ‘రేపు ఏం చేద్దాం? ఎలా చేద్దాం?’ అనే ఆలోచనతో ముందుకు సాగాలి. లేనిపోని ఊహలతో – ఆలోచనలతో కూడా భయాలు కలుగుతాయి. ఇంట్లో అయినా, బయట అయినా భయానికి కారణం.. చీకటి. వెంటిలేషన్ లేని గృహాలు నేడు కోకొల్లలు. మీరు అలాంటి ఇంట్లో చేరి ఉంటారు. అవకాశం ఉంటే.. అదనపు వెలుతురు కోసం కిటికీల సంఖ్య పెంచండి. అనవసరమైన వస్తువులు తొలగించండి. మూసిన వెంటిలేటర్లు తెరవండి. చుట్టూ ఖాళీలేని గృహంలో వెలుతురు అసలే ఉండదు. అలాగే.. తూర్పు-ఉత్తరం మూతపడ్డ ఇంట్లో కూడా భయాలు కలుగుతాయి. కారణాలు తెలిస్తే సవరించండి. లేదంటే మరో ఇంటికి మారిపోండి.
ఇంట్లో, ఆఫీస్‌లో ఏ దిక్కున ముఖం చేసి కూర్చోవడం మంచిదంటారు?
– ఎస్. అనురాధ, కొండగడప
గృహ యజమాని, ఆఫీస్‌లో యజమాని.. తప్పకుండా తూర్పు లేదా ఉత్తరంవైపు ముఖం పెట్టి కూర్చునేలా ప్లాన్ చేసుకోవాలి. భూమి పడమర నుంచి తూర్పునకు తిరుగుతూ ఉంటుంది. కాబట్టి సవ్యదిశకు ముఖం పెట్టడంలో తెలియని ఒక పొందిక ఉంటుంది. తద్వారా మన శరీరంలోని ప్రధాన అవయవాలు సులభంగా చైతన్యవంతం అవుతాయి. అందుకే, యజమాని స్థానాన్ని చాలా ముఖ్యంగా చూస్తారు. అలా అని మిగతా దిశలు పనికి రావని కాదు. ఉత్తర ముఖంగా కూడా కూర్చోవచ్చు. ఆ విధంగా వరుస క్రమంలో తూర్పు-ఉత్తరం లేదా పడమర-దక్షిణ దిశలకు కూర్చోవచ్చు. ఒక్కో కార్యానికి ఒక్కో ముఖంగా కూడా కూర్చోబెట్టాల్సి వస్తుంది-ప్రధానంగా ఆఫీసులో. ఇంట్లో మాత్రం.. యజమాని తప్పకుండా తూర్పు ముఖంగా లేదా ఉత్తరం ముఖంగానే కూర్చోవాలి. హాస్టల్ గదులు – క్లాస్ రూములు – ఆఫీస్ రూములు ఎలా.. ఏ దిశల్లో కట్టాలో వివరంగా చెప్పండి.
– ఎం. తిరుమల రావు, చెర్లపల్లి
మీరు రెసిడెన్షియల్ స్కూల్ ప్లాన్ చేయాలని అనుకుంటే.. మొత్తం చదువు గదులు వేరు, హాస్టల్ గదులు వేరు చేయాలి. పిల్లలు తూర్పునకు గానీ, ఉత్తరానికి గానీ ముఖం పెట్టేలా.. ఉపాధ్యాయుడు పడమర లేదా దక్షిణం ముఖం పెట్టేలా.. తరగతి గదిని సరైన వెంటిలేషన్‌తో ప్లాన్ చేయాలి. పాఠ
శాలను – హాస్టల్‌ను వేరుచేసి నిర్మించాలి. టీచర్ కన్నా.. పిల్లలకే ప్రాధాన్యం ఇచ్చి సీటింగ్ పద్ధతిని ఏర్పాటు చేయాలి. ఉత్తరంవైపు పాఠశాల, దక్షిణ భాగం అడ్మినిస్ట్రేషన్ అంటే.. వార్డెన్ ఆఫీస్, హాస్టల్ బిల్డింగ్ ప్లాన్ చేయాలి. హాస్టల్ గదుల్లో మంచాలు దక్షిణ – ఉత్తరాలుగా అమర్చాలి. తల దక్షిణం ఉండేలా చూడాలి. స్కూల్ యాజన్యం.. ప్రధానంగా పాఠశాల భవనంలోని నైరుతి స్థానాన్ని విధిగా వాడుకోవాలి. హాస్టల్ పరిసరాల్లో వార్డెన్ వగైరా యాజమాన్యం దక్షిణ – నైరుతిలో ఉంటూ వ్యవహారం చేయాలి. మంచి వాతావరణంలో, మంచి దిశల్లో పిల్లలు నివసించాలి.
ఒకే విధంగా కట్టిన వాస్తు ఇల్లు.. అందరికీ ఒకే రకమైన లాభాలు ఇస్తుందా?
– కె. భిక్షపతి, గోల్కొండ
ఇంటిని – మనిషిని వేరుచేసి చూడొద్దు. ‘నువ్వు ఉండే ఇల్లు’ అంటే.. అది నువ్వే! నువ్వు అనేవాడివి.. నీకు నువ్వే ప్రత్యేకం కదా! అందరిలాగా ఎలా ఉంటావు? నీ ఆలోచనలు – అలవాట్లు – అధ్యయనం – ఆచార కట్టుబాట్లు అన్నీ ఇతరుల కన్నా భిన్నంగానే ఉంటాయి. అలా నీ ఇల్లు కూడా.. నీ లక్షణాలతోనే ఉంటుంది. అప్పుడు అదే ఇల్లు.. అన్ని ఇండ్లలా ఒకే ఫలితం ఎందుకు ఇస్తుంది? నీకు తగిన ఫలం లేదా లాభం ఇస్తుంది. ఒక మోటరు వాహనం నా చేతిలోకి వస్తే.. అది నాలాగే మారుతుంది. నా స్పీడు.. దాని స్పీడు అవుతుంది. దానికి స్పీడ్ లిమిట్ ఎక్కువ. కానీ, నడిపేది నేను కదా! ఇంటి మనసు – యజమాని మనసును.. శాస్త్రం ఏకం చేస్తుంది. నీకు నచ్చిన విధంగా రంగులు, ఫ్లోరింగ్, గదుల కొలతలు, ఇంటి ముందు ఖాళీ, మొక్కలు, వాటి రకాలు, కిటికీలు, ద్వారాలు, హాలు.. ఇలా ఎవరికి అవి ప్రత్యేకం. మనసును బట్టి మనో గృహం నిర్మితం అవుతుంది. అది శాస్త్రబద్ధంగా, మంత్రబద్ధంగా నిర్మితం అయితేనే.. నీ ఆకాంక్షలను తీరుస్తుంది.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

