Vasthu Shastra | సైనికులు ఉన్న ఇల్లు కొనుక్కోవచ్చా?
– జి. మూర్తి, కొంపల్లి
సాధారణంగా సైనికులకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన నివాస సముదాయాలే ఉంటాయి. అయితే, కొన్నిసార్లు ప్రభుత్వం వాళ్లకు స్థలం ఇచ్చి, గౌరవించుకుంటుంది. అలాంటి చోట కొందరు ఇండ్లు కట్టుకుంటారు. చట్టపరంగా వాటిని కొన్ని సంవత్సరాల వరకూ విక్రయించకూడదు. ఇక్కడ చట్టపరమైన అంశాలూ ప్రధానమే. అన్నీ చూసుకోవాలి. ఇక.. వాస్తుపరంగా చూసినప్పుడు అన్నీ అనుకూలించి, కొనుగోలు చేస్తే.. ఏ ఇల్లు అయినా తీసుకోవచ్చు. ప్రత్యేకంగా సైనికులు ఉన్న నివాసాలు కొనవద్దు అని ఏ శాస్త్రంలోనూ లేదు. సైనికులు గౌరవనీయ స్థానంలో ఉంటారు. అలా అని, వాళ్ల స్థలాలు, ఇండ్లు కూడా శాస్త్రపరంగా గొప్పగా ఉండాలని ఎక్కడా లేదు. వాస్తు విషయంలో తప్పులు సైతం ఉండొచ్చు. అన్నివిధాలుగా బాగుంది అని నిర్ణయించుకుంటేనే.. ఆ ఇంటిని తీసుకోండి. అంతేకానీ, గతంలో నివాసితులు ఎవరు అనేది ప్రత్యేక నియమం కాదు.
మాస్టర్ బెడ్రూమ్లో మెజనైన్ వేసి వాడుకోవచ్చా? మా పిల్లల కోసం!
– వందన్ కుమార్, కోరుట్ల
ఇంటి ఎత్తును ముందుగా స్థిరం చేసుకోవాలి. అంటే.. ఇంటి ఫ్లోరింగ్ నుంచి కనీసం ఇంటి ఎత్తు పద్దెనిమిది అడుగులు తీసుకుంటే కానీ.. నైరుతి బెడ్రూమ్లో మెజనైన్ స్లాబ్ వేయడానికి వీలుండదు. దీనికి రెగ్యులర్ హైట్ పనికిరాదు. మాస్టర్ బెడ్రూమ్లో ఎత్తు వచ్చినట్లయితే.. అది అన్ని గదులలోనూ సమానంగానే ఉండాలి. కేవలం నైరుతిలో మాత్రమే ఎత్తుచేసి, మిగతా తగ్గించి.. మాస్టర్ బెడ్రూమ్లో మెజనైన్ స్లాబ్ వేసుకోవడం మంచిదికాదు. తద్వారా కొలతలు మారిపోయి.. ఇంటిలోపలి ఆవరణ నెగెటివ్‌గా మారుతుంది. అది పెద్దదోషం అవుతుంది. పిల్లల కోసం డబుల్ హైట్ మంచాలు వేసి వాడటం వేరు. ప్రత్యేకంగా మెజనైన్ స్లాబ్ వేయడం వేరు. మెజనైన్ వేస్తే.. దానిపైన కూడా కనీసం తొమ్మిది అడుగుల స్పష్టమైన ఎత్తు ఉండాలి. రాజీపడటం కుదరదు. ఆలోచన సరే.. దానిని అమలు చేయాలంటే అన్ని రకాలుగా శాస్ర్తాన్ని అనుసరిస్తూ ఇల్లు కట్టాల్సి వస్తుంది. జాగ్రత్తగా అన్నీ చూసుకొని, తెలుసుకొని నిర్మాణం చేపట్టండి. ఇంటికన్నా మన ఇష్టాలు ముఖ్యం కాదనే విషయం గుర్తుంచుకోండి.
– సి. బిందు, మోత్కూర్
మీ ఇంటిని మీ ఇష్టం వచ్చినట్టు కట్టుకోవచ్చు. ఆ హక్కు మీకుంది. కానీ, దానికి శాస్త్ర అంగీకారం కూడా ఉండాలి. మీ ఇష్టాలు తప్పుకాదు. కానీ, శాస్త్ర ఆమోదం పొందినప్పుడే అది వాస్తు గృహం అవుతుంది. ఇంటిని అనేక చోట్ల కట్‌చేసి.. ‘ప్లస్’ ఆకారంలో, ‘యూ’ ఆకారంలో, ‘ఎక్స్’ ఆకారంలో చాలా చిత్రంగా స్లాబులు వేస్తున్నారు. దానికి వాళ్లు పెట్టుకునే పేర్లు.. మాడ్రన్ హౌస్. కడుపులో బిడ్డకు కరెక్షన్ చేసే అవకాశం ఇస్తే.. వీళ్లు ఎంత ఘోరమైన రూపాలు ఇస్తారో! అందుకే, ప్రకృతి ఆ అవకాశం మనిషికి (తల్లిదండ్రులకు) ఇవ్వలేదు. తన చేతిలోనే పెట్టుకున్నది. ఇంటిని రెండు కట్లతో, మూడు కట్లతో కట్టవద్దు. చతురస్రం లేదా దీర్ఘచతురస్రం లేదా ఛత్రశాల గృహాలు కట్టుకోవచ్చు. నివాసాన్ని ఆడంబర వస్తువుగా భావించడం తప్పు. ఇంటిని శాస్త్రబద్ధం చేసి, దైవిక భావనతో నిర్మించాలి. అప్పుడే బతుకులు బాగుపడుతాయి. జన్మ లక్ష్యాన్ని పొందుతాయి.
– బి. సిద్ధేశ్వర్, ఆదిలాబాద్
మనిషి – మనిషికి ఇష్టాయిష్టాలలో చాలా తేడాలు ఉంటాయి. కొందరేమో దూరమైనా ప్రశాంత వాతావరణం అనుకుంటారు. మరికొందరు నగరంలో అందరి మధ్యా ఇల్లు ఉండాలని ఆశిస్తారు. విల్లాలు చాలావరకు నగరానికి దూరంగా నిర్మిస్తుంటారు. మహానగరాలు విస్తరిస్తున్న నేపథ్యంలో పొలిమేర (శివారు) అనేది మారుతూ ఉంటుంది. ఎక్కడ ఇల్లు కొన్నా.. రెండు అంశాలు చూసుకోవాలి. ఒకటి.. చట్టబద్ధంగా నిర్మితమైనదేనా?. రెండోది.. శాస్త్రపరంగా కట్టిందేనా?. ఈ రెండూ అనుకూలంగా ఉంటే.. ఆ ఇంటిని కొనడం తప్పుకాదు. జనావాసాల మధ్య ఉండాలంటే అపార్ట్మెంట్లు చాలా లభిస్తాయి. అయితే, అవి శాస్త్రబద్ధంగా కాకుండా.. అడ్డదిడ్డంగా కట్టే అవకాశం ఉంటుంది. పైగా పై ఫ్లోర్లకు పర్మిషన్లు తీసుకున్నారా, లేదా? అనేది చూసుకొని కొనండి. చట్టపరమైన భద్రత-శాస్త్రబద్ధత ఉన్న ఇండ్లన్నీ మంచివే!