– డి. వసుంధర, షాద్‌నగర్.
మీ ఇంటికి వాయవ్యం ద్వారం కానీ, వాయవ్యంలో సెప్టిక్ ట్యాంక్ కానీ ఉందా?.. అలాగే, వాయవ్యంలో కాంపౌండ్‌ను ఆనుకొని టాయిలెట్లు వేశారా? లేదా ఆగ్నేయంలో గొయ్యి కానీ, పాత బావిగానీ ఉందా? ఇవన్నీ చూసుకొని సవరించుకోండి. సహజంగా స్త్రీలు ఎంతో సహనంతో ఉంటారు. మీ లేఖలో చాలా విషయాలు రాశారు.
ఇంటి లోపాలు చూసుకోవడంతోపాటు డాక్టర్ గారికి కూడా ఆమె మానసిక స్థితి గురించి చూపించండి. అందరికీ అర్థం కాని విషయం ఏమిటంటే.. ఇల్లును పడమర దిశ అని కడతారు. కానీ, కచ్చితంగా అది పడమర ఉండకపోవచ్చు. విదిక్కుల స్థలం అయి ఉండవచ్చు. అప్పుడు మీ పడమర ద్వారం వాయవ్యం అయ్యే అవకాశం ఉంది. అలా ఉంటే.. ఇంట్లో గొడవలు – చికాకులు వచ్చి, మనశ్శాంతి లేకుండా పోతుంది. అన్నీ పరిశీలించి చూసుకోండి.
Shubha Vastu
– వి. జయకుమార్, వనస్థలిపురం.
మీది ఆగ్నేయం బ్లాకు. తూర్పు – ఆగ్నేయం బాగా పెరిగి.. ఉత్తరం కన్నా అధికంగా దక్షిణం స్థలం ఉంది. ఇందులో నిర్మాణం చేసుకోవచ్చు. ఆగ్నేయం స్థలం అనీ, దక్షిణం రోడ్డు అనీ భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా స్థలం విశాలమైనదే కాబట్టి, పెరిగిన తూర్పు – ఆగ్నేయ భాగాన్ని ముందు తీయండి. అంటే, ఉత్తరం భుజం ఎన్ని ఫీట్లు ఉందో.. అంతే సమానంగా దక్షిణం భుజాన్ని కూడా సరిచేయండి.
అప్పుడు అది ఒక దీర్ఘ చతుర్భుజ లేదా సమచతుర్భుజ స్థలంగా మారుతుంది. ఇక పెరిగిన ఆగ్నేయం త్రిభుజాన్ని వేరే పేరుతో పెట్టి, సపరేటుగా నిర్మాణం చేసుకోండి. షాపులు కూడా కట్టుకోవచ్చు. ఇక మిగిలిన స్థలంలో మీరు అనుకున్న అపార్ట్మెంటును ప్లాన్ చేయండి. దక్షిణం ప్రధాన గేటుతో నిర్మించండి. తూర్పు రోడ్డు కూడా ఉంది కాబట్టి, తూర్పు – ఈశాన్యంలో ఒక గేటు పెట్టుకొని ఫ్లాట్స్‌ను శాస్త్రబద్ధంగా కట్టండి. నిర్మాణం చక్కగా వస్తుంది.
– కె. ఉపేంద్ర, సైనిక్‌పురి.
వ్యక్తి అవసరాలు పెరిగాయి అనీ, ఆధునిక ప్రపంచం అనీ, రోబో యుగం అనీ.. నిర్దిష్టమైన శాస్త్రంలో మార్పులు చేర్పులు ఉండవు. వీధిని బట్టి సెల్లార్ తీసుకోవచ్చు. కమర్షియల్ నిర్మాణాలకు పార్కింగ్ చాలా అవసరం. ఆచోట ఎలాగూ.. విల్లాలు ఉండవు. అపార్ట్మెంట్లు కట్టినా.. అవికూడా ఒక విధంగా కమర్షియల్ నిర్మాణాలే అవుతాయి. ఎప్పుడైతే నేలమీద ఒక ఇంటిని నిర్మిస్తామో.. దానికి సెల్లార్ లేకుండా కట్టాలి.
అది చాలాముఖ్యం. వందల అపార్ట్మెంట్లు ఉన్నప్పుడు.. అది ఒక యజమానికి సొంతం అయిన స్థలం కాదు. అది కొన్ని వందల ఇండ్ల సముదాయం. పైగా అవి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన గృహాలు కావు. ఆచోట దోషం ఉండదు. ఇక ఇంటి నిర్మాణం అనేది చుట్టూ ప్రాకారం, మనదైన క్షేత్రంలో నిర్మించే వాస్తుగృహానికి సెల్లార్ తీయడం చాలా ఇబ్బందికరం. కాబట్టి, ఎలాంటి నిర్మాణాలకు అలాంటి ఫలితాలే ఉంటాయి. అందుకే, శాస్త్రం చెప్పినట్టు నడుచుకోవడం తప్పుదు.
– కె. చంద్రశేఖర్, హస్తినాపూర్.
పట్టణాలు, అభివృద్ధి చెందే మహానగరాల్లో ఎన్నో పురాతనమైన చిన్న చిన్న గుడులు, అప్పటి కాలమాన పరిస్థితులకు ఆయా స్థలాల్లో కట్టి ఉంటారు. అలాంటి చిన్న గుడులను, అశాస్త్రీయంగా వ్యక్తులచేత నిర్మితమైన వాటిని.. ఉద్వాసన క్రతువులతో స్థానచలనం చేసి, మరోచోట కట్టుకోవచ్చు. అంతేకానీ, వాటిని తొలగించడానికి ముందుకు రాకపోవడంతో ఇలా నలుగురూ నడిచే కాళ్ల కింద గుడులు మిగిలిపోతున్నాయి.
దైవం అంతటా ఉంది. మనం పవిత్రంగా ఉండేచోట, నలుగురు ప్రశాంతంగా వచ్చివెళ్లే చోట ఆగమశాస్త్రం ప్రకారంగా గుడి కట్టుకొని, ఆ దేవతను గౌరవించడంలో అర్థం ఉందికానీ, ఫ్లై ఓవర్ కింద గుడిని అలాగే వదలడం మంచిదికాదు. రోడ్డు అన్నప్పుడు దానిని అన్నిటికీ వాడుతారు కదా! అంబులెన్సులు కూడా వెళ్తుంటాయి. గుడి ప్రాధాన్యత ఎరిగి, నిర్ణయం తీసుకుంటే.. అందరికీ మంచిది.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143