– దాన స్వరూప, ఎల్బీ నగర్
ఇల్లుకు తూర్పు-ఉత్తరం దిక్కులు ఊపిరితిత్తుల వంటివి. వాటిని సదా కాపాడుకోవాలి, నిలబెట్టుకోవాలి. ఇల్లుకు బాల్కనీలు ఇచ్చినప్పుడే తూర్పు ద్వారం, ఉత్తర ద్వారం పెట్టగలం. ఆ ద్వారాలే ఆ దిశల విశేషాలను మనకు ఆపాదింపజేస్తాయి. ఇంటికి తూర్పు వదలకుండా ఇల్లు కట్టుకుంటే ఇంటి వైశాల్యం పెరుగుతుందేమో కానీ వైషమ్యాలూ, అనారోగ్యాలు సైతం వెంబడిస్తాయి.
నేలమీద ఇల్లు కడితే తూర్పు-ఉత్తరం ఖాళీగా వదులుతాం. అదే ఇల్లుకు పైన తూర్పు- ఉత్తరం ఖాళీ అనేది బాల్కనీల ద్వారానే వస్తుంది. కనీసం తూర్పు బాల్కనీ ఐదు అడుగులు ఉండాలి. ద్వారం కూడా ఉండాలి. మెట్లు ఉత్తర-వాయవ్యంలో ఉంటే, మెట్ల వెడల్పుతో సమానంగా బాల్కనీ రావాలి. బాల్కనీలు పెద్దగా ఉంటే ఎంతో మంచిది. స్థలం పోయిందని బాధపడవద్దు.
– వి. శారద, కరీంనగర్
హాస్పిటల్ దగ్గర మరణించేవారు, రోగులు ఉంటారనే భయంతో ఆ ప్రాంతంలో ఇండ్లు కట్టుకునేందుకు కొందరు భయపడుతుంటారు. వాస్తవానికి వైద్యశాల చుట్టూ నాలుగు వీధులు రావడం మంచిది. ఇండ్ల మధ్య రోగులు ఉండకుండా విశాలమైన మైదానం, ఖాళీ ప్రదేశాలు వీటికి అనువైనవి. ఒకప్పుడు కాంపౌండ్లు ఉన్న పెద్ద స్థలంలోనే ఆసుపత్రులు ఉండేవి. అలాగే ఉండాలి కూడా.

గృహ సముదాయాలను ఆసుపత్రులుగా చేసి ప్రైవేట్‌గా వాడటం అంతమంచి విధానం కాదు. వేటి ప్రాధాన్యత వాటికి ఉంటుంది. ఇల్లు-ఆసుపత్రి ఒక దగ్గర ఉంటే మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంటికి తప్పక కాంపౌండ్ ఏర్పాటు చేసుకోవాలి. ఎవరింటికి వారు ఖాళీ స్థలం ప్రత్యేకంగా వదిలి
నిర్మాణాలు చేసుకోవాలి.
– కాలువ మల్లేశ్, వలిగొండ
ఇంటిని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ భూమిని లెక్కించకూడదు. పంటపొలాలు వేరు, గృహక్షేత్రం వేరు. వ్యవసాయ భూమికి పడమరలో వాగులు, వంకలతోపాటు దక్షిణంలో బావి కూడా ఉండవచ్చు. అవి ఆయా దిశలలో ఉండినా దోషాన్ని మాత్రం కలిగించవు. వ్యవసాయ భూమికి కంచె కట్టినా, కట్టకున్నా దోషం ఉండదు. తప్పనిసరిగా ప్రహరీ ఉండాలనే నియమేమి లేదు.

ఆ స్థలంలో ఇల్లు కట్టాలనుకుంటే మాత్రం దానికి తగిన, ఉచ్ఛమైన స్థలం చూసి సరైన విధంగా వాస్తు ప్రకారం కాంపౌండ్‌ను ఏర్పాటు చేసుకొని దానిలో ఇల్లు కట్టాలి. బావులు, వాగులు, వంకలు అన్నీ చూసుకొని వాటిని తూర్పు, ఉత్తరంలో వచ్చేలా ఆచోట ఇంటి నిర్మాణం చెయ్యాలి. శాస్త్రంలో ఉన్న సలహాలతో వ్యవసాయాన్ని వ్యవసాయంగానే.. ఇంటిని ఇంటిగానే విభజించి జీవించాలి. మనకు ఎన్ని తెలిసినా శాస్త్ర పండితుల సలహా మేరకే నిర్ణయం తీసుకోవాలి.
– శ్రీధర్, జారంపేట
తప్పకుండా నెరవేరుతాయి. మనిషి ఏ కార్యం చేసినా దానికి భౌతికంగా ప్రకృతి సహకారం అవసరం. ఒక ప్రదేశంలో పెళ్లి పెట్టుకుంటాం. అక్కడికి చేరుకోవాలంటే కారు నడవాలి, ట్రాఫిక్ ఆటంకం ఉండకూడదు. ఇల్లు, పరిసరాలు ఇబ్బంది లేకుండా సహకారం ఉంటేనే అది సాధ్యమవుతుంది. అందుకే సమయాలు, ముహూర్తాలు, ఘడియలు బాగుండాలని జాగ్రత్త పడతారు.

ఇదంతా గృహశాస్త్ర విధిలో ఒక భాగం. మనిషి స్వేచ్ఛగా ఉంటూనే అన్నిటినీ కలుపుకొని సాగాల్సి ఉంటుంది. మీరు చక్కని సంకల్పంతో శాస్త్రీయమైన గృహంలో అనుకున్న పనులు గొప్పగా చేయండి. వాస్తు గృహంలో పనులు ఆలస్యం అవుతాయేమో కానీ, జరగడం మాత్రం పక్కా. మనం చేసే కార్యాలు శుభ సంకల్పంతో, నిజాయతీగా ఉంటే.. ఒక ఏడాది కాలంలోనే అనుకున్న శుభకార్యాలు జరుగుతాయి. మన ఆలోచనలను ప్రకృతి తప్పకుండా స్వీకరిస్తుంది.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143