– జి. సోము, ఉటుకూర్.
గృహానికి సంతానం-సంపత్తి ఇచ్చేవి ఈశాన్య దిశలు. అవి ఉత్తరం-తూర్పు ఈశాన్యాలు. అంటే.. ఆ కోణపు దిశలు ‘సూర్య మిత్రులు’. వాటిని గృహస్తు సొంతం చేసుకోవాలి. తద్వారా ఉదయించే ‘రవి తేజస్సు’తో ఆడపిల్లల ఒడినిండి.. కడుపు పండుతుంది. మీరు గృహంలో తూర్పు-ఉత్తరం ఈశాన్యాలలో ఏదో ఒక ద్వారం అటు తూర్పు లేదా ఉత్తరం పెట్టుకోండి. అలాగే రోడ్డును బట్టి సింహద్వారం ఇవ్వాలి. ఇంటి దిశ ఎటువైపు ఉన్నా తూర్పు-ఉత్తరం ద్వారాలు రావాలి. ఇంటిలో పిల్లల-కవలల చిత్రాలు హాలులో, బెడ్రూములో పెట్టుకోండి. వాయవ్యంలో, ఆగ్నేయంలో గొయ్యి, సెప్టిక్ ట్యాంక్ లేకుండా చూసుకోండి. ఉంటే తొలగించండి. ఇల్లు.. గాలి, వెలుతురు కలిగి ఉండాలి. అలాగే, ఆరోగ్యపరంగా కూడా డాక్టర్‌ను సంప్రదించి, పౌష్టికాహారం తీసుకోండి. గృహం నిర్మాణం అంటే.. ప్రకృతి తోడ్పాటు, శరీర సహకారం రెండూ కలిసి మీరు సంతానం పొందుతారు.
– ఒ. చంద్రశేఖర్, కరీంనగర్.
మన నిర్మాణానికి దక్షిణం-పడమర బలం అవసరం అవుతుంది. ముఖ్యంగా.. దక్షిణం ఇతర నిర్మాణాలు ఉన్నప్పుడు మంచి రక్షణ లభిస్తుంది. కాలువలు, వాగులు, నగరాల్లో పెద్దపెద్ద మురికి నీటి నాలాలు వచ్చినప్పుడు.. ఆ స్థలం బలహీనం అవుతుంది. మీ స్థలానికి దక్షిణమే కాదు.. పడమర కూడా కాలువ వెళ్తున్నది. అంటే.. ఒకే కాలువ దక్షిణం-పడమరతోపాటు నైరుతిని కూడా చేర్చుకుంటూ వెళ్తే.. ఇక ఆ స్థలం మరుభూమి లక్షణాలతో ఉంటుంది. అక్కడ ఏ వ్యాపారం కూడా చేయడానికి ప్రకృతి అడ్డుపడుతుంది. నాలా ప్రధానంగా కాలుష్యానికి కారణం అవుతుంది. అది మానసికంగా, శారీరకంగా మన జీవశక్తిని కృంగదీస్తుంది. పైగా స్థలంలోని మూడు పట్టు ఉండాల్సిన దిశలు నిర్వీర్యం అవుతాయి. హోటల్ కాదు.. ఇల్లు కూడా కట్టవద్దు. చాలామంది దానిమీద స్లాబ్ వేసి నిర్మాణాలు చేస్తారు. అదికూడా మనల్ని నమ్మించి మోసం చేసే ప్రయోగమే! దానిని వదిలివేయండి. ఏ నిర్మాణమూ వద్దు.
– ఎం. సుభాష్, దిల్సుఖ్నగర్.
సాధారణంగా హాస్పిటల్ ప్రాంగణంలో, ఆఫీస్, ఫ్యాక్టరీ ఆవరణల్లో చిన్నచిన్న గుళ్లు కడుతూ ఉంటారు. అవి మానవ నిర్మితాలు. సొంత ప్రయోజనం కోసం.. పైగా, సాధారణ భక్తజనం వచ్చే ఏర్పాట్లు అక్కడ ఉండవు. సొంతంగా కట్టే అలాంటి ఆలయాలకు ఎవరూ కాంపౌండు కట్టరు. అలాంటి వాటికి తగినట్టు చిన్న గోడలతో పరిధి ఏర్పాటు చేసేలా.. కాంపౌండు కట్టుకుంటే మంచిదే! తద్వారా అక్కడి అమ్మవారికి లేదా ఏ దేవాలయం అయినా దానికి పవిత్రత వస్తుంది. ఆ ఆలయాలు ఆగ్నేయం, వాయవ్యంలో కట్టినప్పుడు.. ముఖ్యంగా తూర్పు ఆగ్నేయంలో, తూర్పు ముఖంగా కట్టి, దానికి ఎదురుగా గేటు పెట్టకూడదు. అది ఆ క్షేత్రానికి తూర్పు-ఆగ్నేయం అవుతుంది. ప్రధాన గేటు నుంచే వెళ్లి ఆలయ దర్శనం చేసుకోవాలి. దక్షిణంలో రోడ్డు ఉంటే.. ఆ దిక్కు దక్షిణం-ఆగ్నేయంలో చిన్న గేటు పెట్టుకోవచ్చు. గుడికి ఎదురుగా గేటు.. దీనికి పనికిరాదు.
– కె. నరేందర్, నిజామాబాద్.
లిఫ్ట్‌ను ఉత్తర-వాయవ్యంలో పెట్టుకొని లేదా పశ్చిమ-వాయవ్యంలో పెట్టి.. పశ్చిమ-నైరుతిలో మెట్లు వేయాలి. ఇంటి బయటి లిఫ్ట్ వేస్తున్నారు అంటే.. ప్రధానంగా లిఫ్ట్ గొయ్యితో కూడుకొని ఉంటే.. ఇంటి ఫ్లోరింగ్ ఎత్తును, కాంపౌండు లోపలి ఎత్తును జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. రోడ్డు కన్నా ప్రహరీలోని ఆవరణం రెండు అడుగులు ఎత్తు పెట్టుకొని నిర్మాణం చేయాలి. తద్వారా ఇంటి లిఫ్ట్ గొయ్యి సరిగ్గా నిర్మాణానికి సరిపడుతుంది. గొయ్యి ఐదు లేదా ఆరు అడుగులు తీసినా ఇబ్బంది లేదు. మీరు రోడ్డును బట్టి కామన్ లిఫ్ట్ కావాలని అనుకుంటున్నారు కాబట్టి, లిఫ్ట్-మెట్లు పడమరలో కానీ, దక్షిణంలో కానీ పెట్టుకున్నప్పుడు.. తూర్పు-ఉత్తరం ఓపెన్ ఉండేలా నిర్మాణానికి ఆ దిశల్లో బాల్కనీ పెట్టుకోండి. చాలా పెద్దబలం పొంది, వృద్ధి చెందుతారు.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143