– మైలారం చంద్రం, ఖమ్మం
నైరుతి పెరిగి పడమర వైపు రోడ్డు ఉందంటే ఆ స్థలాన్ని, పెరిగిన నైరుతిని వేరు చేయాలి. అప్పుడు అది శుద్ధ స్థలం అవుతుంది. కానీ, మీది వేరుగా ఉంది. కొన్ని చోట్ల వాయవ్యం తగ్గి అక్కడ మాత్రం రోడ్డుకు ఆనుకొని, పోను పోను నైరుతి పెరిగినా.. మన స్థలానికి నైరుతి వద్ద పడమరలో ఇతరుల స్థలం ఉంటుంది. మీరు పంపిన ప్లాన్ ఈ రెండోది. పడమర రోడ్డు కాదు పడమర వాయవ్యంలో మాత్రమే కనెక్ట్ అయి రోడ్డు వెళ్లి పోయింది. ఇలాంటి స్థలంలో చాలా జాగ్రత్తగా వర్క్ చేయాలి.
పడమర వాయవ్యంలో స్థలం మెట్లకు కట్ చేసి ఎక్కువ భాగం పడమర నైరుతి నిలబడేలా గేటు మందం పడమర వాయవ్యంలో తగ్గించాలి. మిగతా భాగాన్ని 90 డిగ్రీలకు సెట్ చేసి కాంపౌండ్ కట్టి అందులో మీరనుకుంటున్న బిల్డింగ్ ప్లాన్ చేసుకోవాలి. ఈ విధంగా మంచి నిర్మాణం చేసినవారవుతారు. అన్నం వండాక రాళ్లు ఏరిపారేయం కదా.. నిర్మాణం కూడా అంతే! స్థల దోషం సవరించకుండానిర్మాణం చేపట్టకూడదు. మీ స్థలం మంచిదైనా దానిని సంస్కరించడం అవసరం.
– వర్ధమాన్ శ్రీకాంత్, గద్వాల
ఎవరు ఎన్ని ఇండ్లల్లో ఉన్నా వాటి ప్రభావం మంచి, చెడు అనేదే ఉంటుంది. అంతేకాదు బాల్యంలో ఉన్న ఇల్లు చాలా ఎక్కువ ప్రభావం చూపుతుంది. లేత మనసుపై పరిసరాల శక్తి ఎక్కువ ఆక్రమణ చేస్తుంది. చిన్నప్పుడు చూసినవి, అనుభవించినవి ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి. కొన్ని జబ్బులు కూడా కొన్ని ఇండ్లలో ఉన్నప్పుడు శరీరంలోకి చేరుతాయి.
ఆ తరువాత మనం చేరే ఇండ్లు వాటికి ప్రమోషన్ ఇస్తాయి. పుట్టినప్పటి నుంచి ఇల్లు మంచి గృహమైతే.. మంచిదాంట్లోకి, చెడు ఇల్లయితే అలాంటి వక్ర గృహాల్లోనే మనం చేరుతుంటాం. అలా ఇండ్లు మనకు తెలియకుండానే మనమీద సవారి చేస్తుంటాయి. ఇప్పటికైనా మీరు ఉంటున్న ఇంటి స్థితిగతులు మీ కోసం కాకపోయినా మీ సంతానం కోసమైనా ఎలా ఉన్నాయన్న విషయాలు తెలుసుకోండి. అందుకు తగ్గట్టుగా మార్పు చేర్పులు చేసుకోండి.
– వి హరీష్, అత్తాపూర్
చాలా మంది ఇంటిని, దాని భవిష్యత్తును లేనిపోని గొప్పల కోసం తాకట్టు పెడుతుంటారు. ఎవరో చెప్పినవి, ఎక్కడో చూసినవి వెంటాడి, వేటాడి వాటిని తన ఇంటిలో చూడటం కోసం తాపత్రయ పడుతుంటారు. అలాంటి వారి కోరిక సరైందికాదు. అవి యోగ్యమైనవా కావా, శాస్త్ర ఆమోదం వాటికి ఉందా? అని చూడాలి. కాయ అని పిలిచే ప్రతిదీ కొబ్బరికాయ కాదు కదా! మీ ఇంటిలో ఉత్తరం దిక్కు బాల్కనీ ఎలివేషన్ ఎలా తీసుకున్నా పర్వాలేదు. కానీ, ఆ ఉత్తరం బాల్కనీ భాగాన్ని ఇంటిలోకి కలుపుకోవడం మంచిదికాదు. మీ గది పెద్దది చేయడం కోసం ఉత్తరం ఆక్రమణ వల్ల ఆర్థిక ఇబ్బందులతో పాటు ఇంట్లో స్త్రీలు అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది. ఉత్తరాన్ని ఉత్తమంగా బాల్కానీగా ఉంచి వాడుకోండి. అది జీవశక్తిగా మారుతుంది. ఇంటిల్లిపాదికీ ప్రశాంతతను ప్రసాదిస్తుంది.
– గమాటి రాంరెడ్డి, ఆలేరు
వ్యవసాయ క్షేత్రం కనుక అయితే బావి ఏ దిక్కుకున్నా ఇబ్బంది లేదు. మీరు ఆ స్థలాన్ని ‘లే అవుట్’ కోసం కొనాలనుకుంటే మాత్రం ఆ ప్రదేశాన్ని వదిలేయడం ఉత్తమం. అందులో నీళ్లుంటే దాన్ని ఆలాగే ఉంచి వాడుకోవచ్చు! లేదంటే అందులో బోరొకటి వేసి ఉపయోగించుకోవచ్చు.
ఇండ్ల లే ఔట్ ప్లాన్ చేయాలని అనుకుంటే ఎలాంటి నిర్మాణాలు దానిమీద చేయకుండా ఆ స్థలాన్ని పార్కింగ్కోసం ఉపయోగించుకోండి. బావిని అలాగే ఉంచి దానిచుట్టూ పక్కల ఇండ్లు దగ్గరలో లేకుండా ముఖ్యంగా దక్షిణ పడమర బావి రాకుండా ఇండ్ల నిర్మాణం చేయాల్సి ఉంటుంది. స్థలంలో దిశలకు లే అవుట్ వేసుకొని చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. ఎకరాల్లో స్థలం ఉన్నప్పుడు బావి సమస్య కాదు. ఎలాగైనా మనం ప్లాన్ చేసుకోవచ్చు. జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143