– పి. పద్మ, మాతూర్.
అందరికీ.. ఇదొక విచిత్రమైన ఆతృత. ఎప్పుడు మంచి జరుగుతుంది? ఎప్పుడు ఈ సమస్యలు పోతాయి? అని మనిషికి ఆసక్తి ఉండటం తప్పుకాదు. కానీ, చేసిన కార్యానికి తప్పక ఫలితం ఉంటుంది అనేది నమ్మి తీరాల్సిన శాస్త్రవచనం. మనం మంచి జరుగుతుంది అనే మార్పులు చేశాం. ఇక దాంట్లో శంక ఉండకూడదు. ప్రకృతి ధర్మం తప్పక పాటిస్తుంది. రాత్రి పెరుగుతోడు వేశాక.. అనుమానం ఉండదు. తెల్లారేసరికి పెరుగు అవుతుంది కదా! ఇంట్లో శాస్త్రబద్ధంగా మార్పులు చేశాక సమయం కాస్త పట్టినా.. శుభ పరిణామాలు తప్పకుండా కలుగుతాయి.
అసలు మీరు ఇంటిని మార్చుకోవాలనే సంకల్పం తీసుకున్నప్పుడే మార్పు ఆరంభం అయినట్టు. లేకుంటే మీకు ఆ ఆలోచనే రాదుకదా! ఇంటిలోని వక్రతలు.. వాటి తీవ్రతలు.. అవి ఎంతకాలం నుంచి ఉన్నాయి? అన్నదానిని బట్టి సమయం కాస్త పెరుగుతుంది. తగ్గుతుంది. కానీ, మంచి ఫలం ఆగదు. అయితే మనం ఎప్పుడు? ఎప్పుడు? అని ఎదురుచూస్తూ కాక.. విశ్వాసంతో మన కార్యాలు మనం చేస్తూ పోవాలి. నిరంతరం ఇదే ఫలితం రావాలి. నేను కోరుకున్నదే జరగాలి అని మనమే ఫలం నిర్ధారించుకొని కూర్చోవద్దు. రావాల్సిన ఫలం వచ్చి తీరుతుంది. అది మనకు అనుకూల ఫలమే అవుతుంది.
ఈ ఫలాల అంశం మన వ్యక్తిగత ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉండదు. మనకు ఏది మంచిదో.. అది ప్రకృతి నిర్ణయం చేసి ఇస్తుంది. ‘నేను కోరుకున్న ఉద్యోగం వస్తుంది అనుకున్నా కానీ, రాలేదు’ అని బాధపడవద్దు. మనం కోరింది కాకపోయినా.. మనకు రావాల్సిన, మనకు అవసరమైన ‘మంచి ఉద్యోగమే’ వస్తుంది. ఇలా పాజిటివ్ ఆలోచనతో ఉండాలి. ప్రయత్నం చేశాక.. నిర్ణయం ప్రకృతి తీసుకుంటుంది. దానిని ఆమోదించడమే మనం చేయాల్సిన పని. ఇందుకు కొన్ని ఇండ్లలో ఆరు మాసాలు, కొన్ని ఇండ్లలో ఏడాది కాలం పడుతుంది.
– డి. చందు, గుర్రంగూడ.
ఇల్లు – గోడలు. ఇవి ఇంటి సమస్త వైభవానికి మూలం. ఇంటి ఆయువును, ఐశ్వర్యాన్ని అలాగే.. ఇంటి పటిష్టతను కూడా నిర్ధారిస్తాయి. ఒక శుభప్రదమైన ఆకారం – ఆహార్యం గోడలతో ఏర్పడుతుంది. కాబట్టి, మనకు తెలిసినట్టు, నచ్చినట్టు కాకుండా.. శాస్త్రం చెప్పినట్టు కట్టాలి. ఇంటి స్లాబు కింద ఏ గోడకూడా వంకరతో నిర్మించవద్దు. గదిలో గోడలు మెట్నకు.. అంటే, తొంబై డిగ్రీలకు నిలబడి ఉండాలి. ఈశాన్యం పెంచి కట్టడం అనేది తప్పు. ఇంటి నిర్మాణంలో ఏ మూలా పెరిగేలా కట్టవద్దు. అది పెద్దదోషం అవుతుంది. తద్వారా ఇంటిలో అంతర్ ఊర్జ దెబ్బతింటుంది.
అంటే, ఇంటిలో మూలశక్తి కుంటుపడుతుంది. కారణం.. ఈశాన్యాలు పెంచి గోడలు కట్టడం వల్ల మూలల్లో గది కొలతలు పెరుగుతాయి. మొత్తం ఇంటి ఆయుష్షు క్షీణిస్తుంది. ఘన చతురస్రంగా ఇంటి పడక గదుల గోడలు నిలబడినప్పుడు.. వాటి వైభవం వేరుగా ఉంటుంది. ఈశాన్యం పెంచడం వల్ల కర్ణాలు దెబ్బతిని, అసంపూర్ణత ఏర్పడుతుంది. కుక్కర్ ఓ పక్క నుంచి లీక్ అవుతుంటే ఎలా ఉంటుందో.. ఇంటిలో గోడల వక్రత కూడా అంతే! మీరు చేసింది తప్పు. మార్చి అన్ని గోడలను మూలమట్టానికి కట్టండి.
– కె. దశరథ, ఆలేరు.
ఇల్లు నచ్చినప్పుడు కొంటారు ఎవరైనా. అందులో ప్రధానంగా వాస్తు ప్రకారం ఇల్లు బాగుంటేనే కొనాలి. లేదా దానిలో లోపాలు ఉంటే సవరించుకోవాలి. కొన్నవారి పేరుమీద కాకుండా.. మీరు కొన్న ఇల్లు అది కట్టిన సింహద్వారాన్ని బట్టి.. ఆ దిశను బట్టి.. ఆ గృహం శాస్త్రబద్ధంగా ఉందా? అనేది ముందు చూడాలి. బాగుంటే మార్పులు అవసరం ఉండదు. ఎవరైనా ఎవరి పేరుతోనైనా కొనవచ్చు. అన్నీ కట్టిన ఇండ్లే కదా! చాలామంది కొంటున్నారు. అలా ఎవరు ఎవరి ఇల్లు తిరిగి కొన్నా.. చూడాల్సింది ఇంటి నిర్మాణం, ఆ స్థల విధానం. అది దిశలకు ఉందా? విదిక్కులకు ఉందా? లేక వీధిశూలలతో ఉందా? అసలు కొనవచ్చా? లేదా? అనేది చూడాలి. ఎలా ఉంటే అలాగే వాడుకోవాలి అనే రూల్ ఏమీలేదు. అంతా బాగున్నా.. మన అవసరాల మేరకు కొన్నిసార్లు మార్పులు చేయాల్సి వస్తుంది. అప్పుడు అవన్నీ శాస్త్రబద్ధంగా చేసుకోవాలి అంతే! ఒక ఇల్లు దాని నిర్మాణం తీరు, ఆ స్థలం అందరికీ పనికి వచ్చేలాగానే నిర్మితమవుతుంది. కాబట్టి, ఇల్లు బాగుంటే చాలు. కొని అందులో నివసించవచ్చు. పాతది అయినా యోగ్యంగా ఉంటే సరిపోతుంది.
– ఎన్. సంగమేశ్వర్, వర్ధన్నపేట.
బేస్మెంట్ ఎత్తుచేసి కట్టడం వల్ల వీధిపోటు ప్రభావం పోదు. బేస్మెంట్ రోడ్డును బట్టి పెంచడం.. తగ్గించడం ఉంటుంది కానీ, వీధిశూలను బట్టికాదు. వీధిపోట్లకు ఎదురుగా గోడలు కడితేనే ఆ చెడు ఫలితాలు ఆగడం లేదు. బేస్మెంట్ అనేది ఇంటి కిందిభాగంలోకే వస్తుంది కదా! అప్పుడు వీధిశూల ప్రభావం పోదు సరికదా.. బలం అవుతుంది. అంటే.. పొడిచేవాడికి అనుకూలంగా నిలబడినట్టు అవుతుంది. వీధిశూలను నివారించాలి అంటే.. ఆ రోడ్డు భాగం మొత్తం వదిలివేయాలి.
అంటే.. అంతమందం జాగను మన స్థలం నుంచి కట్ చేయాలి. మిగిలిన స్థలంలో నిర్మాణం జరుపుకోవాలి. పెద్ద స్థలానికి మధ్యలో దక్షిణం లేదా పశ్చిమంలో వీధిపోటు పడితే.. అంతమందం ఆ స్థలాన్ని రెండుగా వేరుచేసేలా మధ్యలో పోటుకు ఎదురుగా అంత వెడల్పుతో రోడ్డును లోపలికి తీసుకోవాలి. అప్పుడు రెండు స్థలాలుగా విడిపోయి పశ్చిమం లేదా దక్షిణం వీధిపోటు దోషం పూర్తిగా తొలగుతుంది. ఇలా వీధిని బట్టి అవకాశం ఉంటే నివారించుకోవచ్చు. లేదంటే.. స్థలం వదిలివేయాల్సిందే!
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143