– శ్రీధర్, బొందుగుల
ఇంటి విషయంలో పొత్తులు మంచివికావు. మనదైన ఇంటి జీవితానికి మనవైన హద్దులు తప్పక ఉండాలి. అవి మనవే అయి ఉండాలి. చాలామంది పల్లెల్లో ఇరుపక్కల ఇండ్లవాళ్లు.. ఇదివరకే కట్టుకున్న ప్రహరీలను తమ ఇండ్లకు కూడా ఉపయోగపడతాయనే విధంగా కట్టకుండా వదిలేస్తారు. కానీ, మనదైన ఇంటికి మనవైన కాంపౌండ్లు కట్టినప్పుడే అవి శాస్త్రబద్ధంగా నిలుస్తాయి. దక్షిణం-పశ్చిమం కాంపౌండ్లు తూర్పు-ఉత్తరం కాంపౌండ్లకన్నా ఎత్తు ఎక్కువ ఉండాలి. ఆ విధానం ఎవరి ఇంటిది వారికే వర్తిస్తుంది. ఒకరి ఉత్తరం మరొకరికి (అనగా మన ఇంటి ఉత్తరం వాళ్లకు) దక్షిణం కాంపౌండు అవుతుంది. అలాంటప్పుడు ఇబ్బంది వస్తుంది. కాబట్టి మన కాంపౌండు మనమే కట్టుకోవడం ఎంతోమంచిది. అన్నదమ్ముల ఇండ్లు అయినా ఎవరిది వారే జాగ్రత్తగా కట్టుకోవాలి. వాళ్ల కాంపౌండు ముందుగానే ఎత్తుగా కట్టి ఉన్నా.. మనదైన కాంపౌండు వాళ్ల గోడకు ఆనించి తగిన ఎత్తులో కట్టాలి. అప్పుడే గృహానికి పరిసరాలు సరిగ్గా అమరుతాయి.
– గౌరీశంకర్, తెల్లాపూర్
ఇంటిమీద అంతస్తులో మాస్టర్ బెడ్రూముకు అటు పశ్చిమం కానీ, ఇటు దక్షిణం కానీ బాల్కనీలు ఉండకూడదు. వాయవ్యంలో బెడ్రూముకు పశ్చిమం వైపు బాల్కనీ ఉండవచ్చు. అదికూడా గ్రిల్‌తో కూడుకుని ఉండాలి. అంతేకాదు ఇంటి మొత్తానికి పడమరవైపు బాల్కనీ ఇచ్చినా.. ఆ బాల్కనీలోకి వెళ్లడానికి ద్వారం కూడా వాయవ్యం గది నుండే వెలుపలికి ఇవ్వాలి.

మాస్టర్ గదికి(నైరుతి) వాయవ్యంలో ద్వారం పెట్టి, ఇంటి పశ్చిమ-వాయవ్యంలోని బాల్కనీకి కలపకూడదు. ఏ విధంగా చూసినా ఇంటి యజమానికి బాల్కనీలు లేవు. కారు డ్రైవర్లాగా కచ్చితమైన స్థానంలో బాధ్యతాయుతంగా ఆ గదికే పరిమితమై శయనించాలి. ఇటీవల కాలంలో పడక గదులన్నిటికీ బాల్కనీలు ఇచ్చేస్తున్నారు. అది సరైన విధానం కాదు.
– కాలెపు సత్యం, చాడ
ఇల్లు రోడ్డు మీదికి ఎక్కినట్టుగా, చొచ్చుకొని వచ్చినట్టుగా కట్టవద్దు. ఇల్లు వరుస క్రమంలో ఉంటేనే బాగుంటుంది. తూర్పు ఇల్లు తూర్పు రోడ్డులోకి చొచ్చుకు రావడం దోషం కాదు. కానీ, రోడ్డుపై వెళ్లే వాహనాలకు అది అడ్డుగా ఉంటుంది.

మూలలు జాగ్రత్తగా కట్టండి. శాస్త్రపరంగా మాత్రం దక్షిణం వైపునుంచి -ఉత్తరంవైపు నుంచి అదే వీధి తగులుతూ వెళ్లటం వల్ల ఉత్తర -ఈశాన్యం, దక్షిణ -ఆగ్నేయం వీధులు పడటం మంచి ఫలితమే ఇస్తుంది. ఇలా ఇతర దిశలలో దక్షిణం వైపు, పడమర వైపు వీధులలోకి ఇల్లు పొడుచుకొని వస్తే రెండు వైపులా వీధిపోట్లు వస్తాయి. మీ ఇంటికి దోషం లేదు.
– కొండా శ్రీకాంత్, నెల్లుట్ల
మీ ఉద్దేశం దిశాత్మకంగా లేనప్పుడు.. స్థలం దిక్కును సరిగ్గా సూచించనప్పుడు దిశలన్నీ మారిపోతాయి. ఒక స్థలాన్ని ఇంటికి అనుకూలం చేయడం కష్టం. ఇంటిని తిప్పి కడితే రోడ్డును తిప్పలేం కదా! అప్పుడు రోడ్డు ఒక ముఖం, ఇల్లు మరో ముఖం అవుతుంది. ముఖ్యంగా లే అవుట్ చేసిన స్థలాలు దిశకు లాగి ఉంటేనే బాగున్నట్టు. అలాగని వాటిని తిప్పి ఇండ్లు కట్టవద్దు. అలాచేస్తే వికృత ఫలితాలు వస్తాయి.

రోడ్డు అనేది ఇంటి దిశను నిర్ధారించి ప్రపంచంతో అనుబంధాన్ని ఏర్పరుస్తుంది. అదే వక్రమైనప్పుడు ఎన్నో మార్పులు వస్తాయి. దిశలు అనుకూలంగా లేనప్పుడు ఆ చోట గృహం కట్టే ఉద్దేశాన్ని మార్చుకున్నా మంచిదే కానీ, తిప్పి కట్టే ఆలోచన చేయవద్దు. అలాచేస్తే ఇంటికి అన్నీ ముక్కోణ మూలలు మిగిలిపోతాయి. ఒక ఇరవై ముప్పై ఎకరాల స్థలంలో దిశకు రోడ్లు వేసి, దానికి తగిన ఇల్లు చక్కగా కట్టుకోవచ్చు. అలాంటి ప్రయోగాలు చేయకండి. ఆగం కాకండి.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143